వాతావరణం కాలుష్యం తో నిండిపోవడం వల్ల శ్వాసకోసకు సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాటితో పాటు ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు ఎంతో ముప్పు ఉంటుంది. మనకు తెలియకుండా ఎన్నో హానికరమైన పదార్థాలు మన శరీరం లోకి వెళ్తాయి మరియు ఊపిరితిత్తులు ఆ హానికరమైన పదార్థాలను శుద్ధి చేస్తాయి. కానీ ఊపిరితిత్తులకు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే వాటి సామర్థ్యం తగ్గుతుంది.
ఎటువంటి ఇన్ఫెక్షన్ దరిచేరకూడదు అంటే… బయటకు వెళ్ళేటప్పుడు ముక్కు, నోరు, చెవులకు చల్ల గాలి చేరకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రదేశాలలో మాస్కును ఖచ్చితంగా ధరించండి. బ్రీతింగ్ సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే గోరు వెచ్చని నీళ్లు తాగడం, ప్రాణాయామం చేయడం వంటివి పాటించాలి. అంతే కాదు ఏసీలో ఎక్కువసేపు ఉండకూడదు.
మీరు ఏదైనా శ్వాసకోశ సమస్యల తో బాధపడుతూ ఉంటే జనాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇతరులకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. కనుక ఫ్లూ సీజన్ లో అయితే జనాలు ఎక్కువగా ఉన్న చోటకు వెళ్లకపోవడమే మంచిది. ఏదైనా ఇబ్బంది ఉంది అని చిన్న అనుమానం కలిగిన డాక్టర్ ను సంప్రదించండి. ఎందుకంటే భవిష్యత్తు లో అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది కనుక.