జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాంలో టెర్రరిస్టులు జరిపిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సామాన్యులతో పాటు ఓ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ సైతం ప్రాణాలు కోల్పోయారు. అయితే, తమకు న్యాయం చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలకు,కాశ్మీరీలకు వ్యతిరేకంగా ప్రజలు వెళ్లాలని మేము కోరుకోవడం లేదని.. మాకు శాంతి మాత్రమే కావాలన్నారు. ఉగ్రదాడికి కారణం అయిన వారిని శిక్షించి మాకు న్యాయం చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. ఇదిలాఉండగా, పహెల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారిని అమరవీరులుగా ప్రకటించాలని బాధిత కుటుంబాలు, పొలిటికల్ లీడర్లు సైతం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.