పాక్ అమ్మాయితో మహేశ్ బాబు కొడుకు కనిపించాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పేందుకు భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సరిహద్దుల్లో ఏ సమయం అయినా యుద్ధం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఈ సమయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్.. పాకిస్తాన్ అమ్మాయితో కలిసి వీడియో చేశాడు.

గౌతమ్ ఇండియన్ జెర్సీ ధరించి పాక్ జెర్సీ ధరించిన అమ్మాయితో షికార్లు వేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రత పెంచారు. ఢిల్లీ పర్యాటక ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక నిఘా పెట్టింది. ఉగ్రవాదులు ఢిల్లీని టార్గెట్ చేయొచ్చంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. అటు పహల్గాం ఉగ్రవాదులు గురించి షాకింగ్ నిజం బయటపడింది. ఇంకా భారత్‌లోనే పహల్గాం ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రదాడి అనంతరం దక్షిణ కాశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లి దాక్కున్నారని తెలిపింది ఓ దర్యాప్తు సంస్థ. ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పరికరాలను వాడి ఉగ్రవాదులు తప్పించుకుంటున్నారని తెలిపింది ఎన్ఐఏ.