తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మరోసారి హై టెన్షన్ నెలకొన్నది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం జవాన్లు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు కర్రెగుట్టల్లో బలగాలు కూబింగ్ కొనసాగిస్తున్నాయి.
బేస్ క్యాంపు నుంచి జవాన్లు ముందుకు కదులుతున్నాయి. కొండల్లో వేలాది మంది జవాన్లు తిష్టవేసినట్లు తెలుస్తోంది.లోయల్లో, అడవిలో భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా. ప్రతికూల పరిస్థితుల్లోనూ జవాన్ల కూంబింగ్ చేపడుతున్నారు. అయితే, ఇరువైపుల నుంచి మావోయిస్టులు జవాన్ల మీద దాడులకు పాల్పడకుండా వారికి రక్షణగా హెలికాప్టర్లు ఆకాశం నుంచి రక్షణగగా నిలుస్తున్నాయి. అత్యాధునిక రక్షణ సామగ్రిని బలగాలు వినియోగించడంతో పాటు డ్రోన్లు, హెలికాప్టర్లు, శాటిలైట్ ద్వారా అగ్రమావోయిస్టుల కోసం నిఘాను పెంచారు.