ఆ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ షూటింగ్ మధ్యలో ఆపేయాలనుకున్న రాజమౌళి..చివరకు..?

-

అపజయం ఎరుగని దర్శకుడు..బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించే దర్శక ధీరుడు అలియాస్ జక్కన్న..ఎస్.ఎస్.రాజమౌళి. ఇటీవల ఆయన RRR సినిమాతో క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికీ తెలుసు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ రాజమౌళి చేయబోయే సినిమా గురించి ప్లానింగ్ చేసుకుంటున్నారు.ఈ సంగతులు పక్కనబెడితే..రాజమౌళి తీసే సినిమా ఏదైనా ఏళ్ల సమయం పడుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చిత్రంలోని ప్రతీ సన్నివేశం తను అనుకున్నట్లు రావాలని రాజమౌళి తపిస్తుంటారు. అలా వచ్చే వరకు నటీనటులను వదిలిపెట్టబోరు రాజమౌళి. ఇకపోతే కీటకం మీద కూడా సినిమా తీసి విజయం సాధించిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. ‘ఈగ’ ఫిల్మ్ తో..ఆయన సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. నేచురల్ స్టార్ నాని, సమంత హీరో హీరోయిన్లుగా నటించగా, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విలన్ గా నటించారు.

ఈ పిక్చర్ స్టోరిని రచయిత విజయేంద్రప్రసాద్ ఫన్నీగా వివరించినప్పటికీ కథ బాగా నచ్చి రాజమౌళి..ఈ ప్రాజెక్టు టేకప్ చేశారట. అలా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, ఇందులో వీఎఫ్ఎక్స్ VFXకు బాగా ప్రయారిటీ ఉందని జక్కన్న గుర్తించాడు. ఓ సంస్థ వాళ్లు ఇచ్చిన గ్రాఫిక్స్ రాజమౌళికి అస్సలు నచ్చలేదట. అలా షూటింగ్ స్టార్ట్ అయిన పది రోజులకు మధ్యలోనే పిక్చర్ ఆపేయాలని అనుకున్నారట. కానీ, ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని తనకు నచ్చినట్లు వీఎఫ్ఎక్స్ వచ్చేలా సూచనలిచ్చి, అలా సినిమా తీశారు. ‘ఈగ’ చిత్రం తెలుగులో ప్రయోగాత్మక చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version