వీవీ వినాయక్‌ను బాలకృష్ణ ఏమని పిలుస్తారో మీకు తెలుసా?

-

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ వీవీ వినాయక్ మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆయన నందమూరి హీరోలతో సక్సెస్ ఫుల్ ఫిల్మ్స్ చేశారు. బాలయ్యతో ‘చెన్నకేశవరెడ్డి’ చేసిన వినాయక్..తారక్ తో ‘ఆది’,‘ సాంబ’, ‘అదుర్స్’ సినిమాలు చేశారు. ఇకపోతే వినాయక్-బాలయ్య కాంబోలో మరో పిక్చర్ రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.

సుమోలు గాల్లో ఎగిరే సీన్ బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’ పిక్చర్ లో హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా బాలయ్య అభిమానులకు బాగా నచ్చినప్పటికీ వసూళ్ల పరంగా సత్తా చాటలేకపోయింది. అయితే, బాలయ్య మాత్రం తాను ఎక్కడ కనిపించినా మరో సబ్జెక్ట్ చెప్తే చేయడానికి తాను రెడీ అని అంటాడని తాజా ఇంటర్వ్యూలో వినాయక్ చెప్పుకొచ్చాడు.

తాను ఎక్కడ కనబడినా బాలయ్య తనను ‘సత్తిరెడ్డి’ అని పిలుస్తాడని తెలిపాడు. సత్తిరెడ్డి అన్న క్యారెక్టర్ ‘చెన్నకేశవరెడ్డి’ పిక్చర్ లోది కాగా, ఇది మూవీలో బాగా హైలైట్ అయింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో ‘ఇంటెలిజెంట్’ ఫిల్మ్ చేసిన తర్వా త బాలయ్యతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యానని వినాయక్ చెప్పుకొచ్చారు. అయితే, స్టోరి వర్కవుట్ కాలేదని, ఈ నేపథ్యంలోనే ఫిల్మ్ ఆగిపోయిందని అన్నాడు. మంచి స్టోరి దొరికితే డెఫినెట్ గా బాలయ్యతో పిక్చర్ ఉంటుందని వివరించారు. వినాయక్ ప్రజెంట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో హిందీ లో ‘ఛత్రపతి’ సినిమా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version