రేపు గిరిజన తండాలు, ఆదివాసీ గుడాల్లో బీజేపీ సంబరాలు

-

భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ద్రౌప‌ది ముర్ము విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కేన‌న్న విశ్లేష‌ణ‌లు
వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగియ‌గా… గురువారం ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. గురువారం సాయంత్రానికే విజేత ఎవ‌ర‌నేది తేలిపోనుంది. ద్రౌప‌ది ముర్ముకు పోటీగా కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా బ‌రిలోకి దిగారు. ముర్ము విజ‌యాన్ని కాంక్షిస్తూ ఆమె సామాజిక వ‌ర్గానికి చెందిన గిరిజ‌నులు భూదేవికి ప్ర‌ణ‌మిల్లి మ‌రీ ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. వంద‌లాది మంది ఒకే చోట చేరి భూమాత‌కు పూజ‌లు చేస్తున్న దృశ్యాలు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

ఈ పూజ‌లు ఎక్క‌డ జ‌రిగాయో తెలియ‌దు గానీ… వీటిని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముర్ము కోసం గిరిజనులు ప్రార్థిస్తున్నటువంటి గొప్ప దృశ్యాలు ఇవి. నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చిన ఆమె రాబోయే రాష్ట్రపతి పదవి వరకు సాధించిన ఔన్నత్యం భారతదేశం తన నాగరికత, రాజ్యాంగ విలువలు,ప్రజాస్వామ్యం పట్ల ఉన్న స్థిరమైన విశ్వాసానికి నిదర్శనం అని వ్యాఖ్యానించిన కిష‌న్ రెడ్డి… ఆ ప్రార్థ‌న‌లు ఎక్క‌డ జ‌రిగాయ‌న్న విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. రేపు రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు ప్రకటించగానే విజయోత్సవ సంబరాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడమే కాకుండా.. పెద్ద ఎత్తున కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం చేసే రోజు అన్ని గ్రామ పంచాయతీల్లో ఆమె చిత్ర పటం తో ర్యాలీలు నిర్వహించనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version