మన వంటింట్లో ఉండే ఈ పాత్రలు ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా?

-

మవ వంటింట్లో ఉండే కొన్ని పాత్రలు కూడా మన అరోగ్యాన్ని దెబ్బతీస్తాయని మీకు తెలుసా. కొన్ని లోహాల్లో వంట చేయటం ఆరోగ్యానికి ప్రమాదమని అధ్యయనాలు నిరూపించాయి. చాలమంది గృహిణులు వంటను చేసుకోవాటనికి కొనే పాత్రలు లుక్ బాగుందనే కొనుగోలు చేస్తారు. వంటగదిలో ఉంటే అందంగా కనిపిస్తాయి అని. కానీ వంటచేసుకునే వాటిల్లో మెటల్ పాత్రలు ఆరోగ్యానికి సురక్షితం కాదట. వాటిల్లో వండుకోని తినటం మంచిదికాదని నిపుణులు అంటున్నారు.

ఇత్తడి..

ఆహారాన్ని వండడానికి, వడ్డించడానికి ఇత్తడి వంట సామాను ఉపయోగిస్తారు. అయితే, ఈ లోహం గురించి అంతగా తెలియని వాస్తవం ఏంటంటే ఇది వేడి, ఉప్పగా ఉండే ఆహారానికి తక్షణమే ప్రతిస్పందిస్తుంది. ఫలింతంగా..లోహం కణాలు ఆహారంలోకి విడుదలవుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇత్తడి పాత్రలు వండటం గొప్ప ఆలోచన కాదు. ఎందుకంటే ఇత్తడి పాత్రల్లో వండిన జింక్‌ ఆధారిత ఆహారాలు జింక్‌ ఆక్సైడ్‌ పొగలను విడుదల చేస్తాయి. ఇది టార్నిషింగ్‌ అభివృద్ధికి దారితీయవచ్చు.

కాపర్‌..

రాగి గ్లాసుల్లో లేదా రాగి బాటిల్ లో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. భారతీయ సంప్రదాయాల్లో కూడా రాగి ఒక భాగం. ఈ లోహంలోని పోషకాలు నీటిలోకి చేరి ఆరోగ్యకరంగా మారతాయని విశ్వసించేవారు. కానీ రాగిపాత్రల్లో వంట చేయడం మంచిదికాదు. ఎందుకంటే ఉప్పు లేకుండా ఏ వంట అవ్వదు. ఉప్పు ఎప్పుడైతే రాగి పాత్రలో వేస్తామో. అది రియాక్టివ్‌గా ఉంటుంది. ఇది ఆహారంతోపాటు ఆరోగ్యంపై కూడా హానికరమైన స్వభావాన్ని చూపుతుందట.

ఉప్పులో అయోడిన్‌ రాగితో చర్య జరుపుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాని రాగి కణాలను మరింత విడుదల చేస్తుంది. రాగి పాత్రల నుంచి తినడం లేదా తాగడం ఆరోగ్యానికి హానికరం కాదు..అయితే రాగిపాత్రల్లో ఉప్పు, మసాలాలతో కూడిన ఆహారాన్ని వేడి చేయడం వల్ల ఆహారంతో రాగి రేణువులను కలపడం ద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

అల్యూమినియం

చాలామంది వంటగదిలో అల్యూమినియం వంట పాత్రల్లో ఎక్కువగా ఉంటాయి. అల్యూమినియం పాత్రలను ఎక్కువగా వాడటానికి కారణం ఏంటంటే..అది త్వరగా వేడెక్కే గుణమే..అయినప్పటికీ టమాట, నిమ్మకాయ, వెనిగర్‌ వంటి ఆమ్ల స్వభావం కలిగిన ఆహారాలు తరచుగా అల్యూమినియం పాత్రతో ప్రతిస్పందిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేడి చేసినప్పుడు అల్యూమినియం కణాలు ఆహారంలోకి ప్రవేశిస్తాయి..అది ఆరోగ్యానికి హానికరం. తరచూ ఇమ్యూనిటీ సిస్టంపై ప్రభావం చూపుతుంది. కేన్సర్‌ వంటి కొన్ని వ్యాధులకు దారితీయవచ్చు.

టెఫ్లాన్‌ కూక్‌వేర్‌..

నాన్‌స్టిక్‌ వంట సామానుకు ప్రాథమికంగా పాలిటెట్రాఫ్లోరో ఎథిలిన్‌ అనే పదార్థంతో పూత పూస్తారు. దీన్ని టెఫ్లాన్‌ అని పిలుస్తారు. అయినప్పటికీ టెఫ్లాన్‌ ఆధారిత పాన్‌లో వంట చేయడం సులభం, వేగవంతమైంది, తక్కువ సమయం అనిపిస్తుంది. టెఫ్లాన్‌ తయారీకి ప్రధానంగా పీఎఫ్‌ఓఏ రసాయానాన్ని వాడతారు. కొన్ని అధ్యయనాల ప్రకారం పీఎఫ్‌ఓఏ కిడ్నీ, కాలేయ వ్యాధి వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది తేలింది. అందుకే మీరు నాన్‌స్టిక్‌ ప్యాన్‌ కొన్నట్లయితే, మంచి నాణ్యత ఉన్నదే కొనాలట.

మరి ఎలాంటి పాత్రల్లో వండుకోవాలి:

సహజంగా రియాక్టివ్‌గా ఉండే వంటసామాను నివారించడం ఉత్తమం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐరన్, సిరామిక్, మట్టికుండలు, లేదా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో వంట చేయడం మంచిది.

ఐరన్‌ పాత్రల్లో వండడం మంచిదే కానీ.. ఇది వేడికి గురైనప్పుడు ఐరన్‌ కణాలు విడుదల చేస్తుంది. పులుపు వండడం వల్ల ఆహారంలో నలుపు రంగును వదిలివేస్తుంది. కాబట్టి రుచికరమైన పదార్థాలు రంగు, రుచిని మార్చే ఇనుము రేణువులను నివారించడానికి ఇందులో ఆమ్ల స్వభావం కలిగిన కూరగాయలను వండకూడదు.

మరోవైపు సిరామిక్, మట్టికుండలు పోషకాలను నిలుపుకోవడంలో ఆహారాన్ని సమానంగా వండటంలో సహాయపడుతుంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రలు క్రోమియం, నికెల్, సిలికాన్, కార్బన్‌లను కలిపి తయారు చేస్తారు. ఇవి ఫుడ్‌ను త్వరగా వేడి చేయడంలో సహాయపడతాయి. ఫుడ్‌ను ఎక్కువసేపు వెచ్చగా ఉంచుతాయి.

మొత్తానికి అధ్యయానాలు, వైద్యులు చెప్తున్నది ఏంటంటే..అన్ని వంటలకు ఒకటే టైప్ పాత్రలను వాడొద్దు. పులుపు, మసాలా వాటికి తప్ప ఇతర సాధారణ వంటకాలకు కొన్ని ఉపయోగపడతాయి. అన్నిటికంటే ఉత్తమం స్టెయిన్ లెస్ స్టీల్ అని తేలింది. వంటచేసుకునే పాత్రల్లో కాంప్రమైజ్ కావొద్దు..కాస్త ఖర్చు ఎక్కువైనా సరే..నాణ్యత ఉండే పాత్రలనే తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version