ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’ క్రేజ్ ఇంకా తగ్గలేదు. అభిమానులు, ప్రజలే కాదు సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఇందులోని పాటలు, డ్యాన్స్ మూమెంట్స్, సిగ్నేచర్ స్టెప్స్ ను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యా పాండే ‘పుష్ప’ చిత్రంలోని ‘సామీ సామీ’ సాంగ్ కు స్టెప్పులేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బన్నీ, రష్మిక మందనల ‘సామీ సామీ’ సాంగ్ స్టెప్పులను కాపీ కొట్టింది అనన్య. ఇక ఈ వీడియో చూసి బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయింది.
డైరెక్టర్ సుకుమార్ ప్రజెంట్ పార్ట్ 2 సినిమా చేస్తు్న్నారు. సుకుమార్-బన్నీ కాంబోలో వచ్చిన ఈ హ్యట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’ దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
.@ananyapandayy 💃 #SaamiSaami 🔥#PushpaTheRule @alluarjun @ThisIsDSP pic.twitter.com/63fC7mT8tp
— Allu Babloo AADHF (@allubabloo) June 5, 2022