సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మకు ఎన్ని కోట్లు ఖర్చయిందో తెలుసా..?

-

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీకి అద్భుతమైన టెక్నాలజీని సరికొత్తదనాన్ని అందించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు కృష్ణ. అలా తన కెరియర్లో ఎన్నో చిత్రాలలో నటించి విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు. అలా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కృష్ణ గడిచిన కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇక నిన్నటి రోజున పెద్దకర్మను కొడుకు మహేష్ బాబు చాలా సాంప్రదాయమైన పద్ధతిలో ఘనంగా నిర్వహించారు.

జెర్సీ ఫంక్షన్ హాల్ లో నాలుగు నుంచి ఐదువేల మంది అభిమానుల మధ్య కృష్ణ పెద్దకర్మ జరగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. జనరల్ పబ్లిక్ కి భోజనాలు పెట్టడంతో పాటు రెండు మాంసాహార వంటకాలు.. మిగిలిన వారికి శాకాహార వంటకాలను ఈ ఫంక్షన్ హాల్ వారే తయారు చేయడం జరిగిందట. అభిమానులతో పాటు సినీ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖులు కూడా అక్కడికి హాజరు కావడం జరిగింది. సినీ సెలెబ్రెటీలు, మీడియా కోసం ఎన్ కన్వెన్షన్ హాల్ లో భోజనాలను ఏర్పాటు చేయడం జరిగిందట. ఈ భోజనాలను జూబ్లీహిల్స్ లోని ప్రముఖ రెస్టారెంట్ నుంచి తయారు చేయించారట.

ఇందులో పలు రకాల నాన్ వెజ్ వంటకాలు సిద్ధం చేయించారు. ఇక్కడకు హీరో నాతో పాటు పలువురు ఆర్టిస్టులు కూడా హాజరు కావడం జరిగింది. ఇక మహేష్ ఇంట్లో పెద్దకర్మ కార్యక్రమాలు నిర్వహించగా అక్కడికి కేవలం మహేష్ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మొత్తం ఇందుకు గాను రూ.2 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే కృష్ణ అంత్యక్రియలతో పాటు చినకర్మ దశకర్మ కార్యక్రమాలు కూడా మహేష్ బాబు దగ్గరుండి విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version