ఒక్క అమెజాన్ ప్రైమ్ వీడియో అకౌంట్‌ను ఎంత మంది వాడ‌వ‌చ్చు ?

-

ప్ర‌పంచ వ్యాప్తంగా చూసుకుంటే నెట్ ఫ్లిక్స్ పాపుల‌ర్ వీడియో స్ట్రీమింగ్ యాప్ గా ఉంది. కానీ ఇండియాలో అమెజాన్ ప్రైమ్ బాగా పాపుల‌ర్ అయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌కు సుమారుగా 10 కోట్ల మంది యూజ‌ర్లు ఉన్నార‌ని అంచ‌నా. అనేక భాషల్లో భిన్న ర‌కాల కంటెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉంది.

అయితే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను ఒక‌టి క‌న్నా ఎక్కువ డివైస్‌ల‌లో వాడాలంటే అందుకు ప‌రిమితులు ఉంటాయి. ప్లాన్‌ను బ‌ట్టి డివైస్‌ల యూసేజ్ మారుతుంది. కానీ అమెజాన్ ప్రైమ్ అలా కాదు. ఎంత మంది అయినా దీన్ని యాక్సెస్ చేయ‌వ‌చ్చు. అయితే అధికారికంగా అమెజాన్ తెలుపుతున్న ప్ర‌కారం.. ఒకేసారి అమెజాన్ ప్రైమ్ వీడియోను ఏకంగా ముగ్గురు ఉప‌యోగించుకోవ‌చ్చు. కానీ కొంద‌రు ఇంత‌క‌న్నా ఎక్కువ సంఖ్య‌లోనే అమెజాన్ ప్రైమ్‌ను ఉప‌యోగిస్తున్నారు.

కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్ర‌స్తుతం డివైస్‌ల సంఖ్య‌పై ప‌రిమితి విధించ‌కున్నా త్వ‌రలోనే దీనిపై అమెజాన్ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలిసింది. భిన్న ర‌కాల ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా నెట్‌ఫ్లిక్స్ లాగే ప్రైమ్ కూడా యూజ‌ర్లు ప్రైమ్‌ను యాక్సెస్ చేసే డివైస్‌ల సంఖ్య‌పై ప‌రిమితులు విధించ‌నున్న‌ట్లు తెలిసింది. ఈ విష‌యం తెలియాలంటే కొంత‌కాలం వ‌ర‌కు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version