రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో గత వారం రోజుల నుంచి చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏపీలోని విజయవాడలో చికెన్ ధరలు వారం రోజుల నుంచి ఒకే విధంగా ఉన్నాయి. విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీకి రూ. 230 రూపాయలు ఉంది. గుంటూరు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రూ. 180 రూపాయలకు కేజీ చికెన్ అమ్ముతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ లో రూ. 190 రూపాయలకు కేజీ చికెన్ అమ్మగా…. వరంగల్ లో రూ. 210 వరకు చికెన్ అమ్ముతున్నారు.

దీంతో చికెన్ ప్రియులు సంతోషపడుతున్నారు. ఎగబడి మరి చికెన్ కొనుగోలు చేస్తున్నారు. భారీగా చికెన్ ధరలు తగ్గడంతో ఎక్కువగా చికెన్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇక శ్రావణమాసం కారణంగా గత కొద్ది రోజుల నుంచి చికెన్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాలలో భారీగా చికెన్ ధరలు తగ్గిపోయాయి. మరో రెండు రోజులలో వినాయక చవితి కారణంగా చికెన్ ధరలు ఏమాత్రం పెరగడం లేదు. వినాయక చవితి పూర్తయ్యే వరకు చికెన్ ధరలు స్థిరంగా ఉంటాయి. తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వినాయక చవితి పూర్తయిన తర్వాత చికెన్ ధరలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.