ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయింది గణేశుడి లారీ. దింతో ట్రాఫిక్ జామ్ భారీగా అయింది. హైదరాబాద్-పంజాగుట్ట చౌరస్తాలో ఫ్లై ఓవర్ కింద ఇరుక్కుపోయింది గణేశుడి లారీ. ఖైరతాబాద్ నుంచి అమీర్పేట్ వైపు గణేశుడి విగ్రహ లారీ వెళుతోంది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో లారీని బంజారాహిల్స్ వైపుకు మళ్లించారు పోలీసులు.

ఇక అటు హైదరాబాద్ మహానగరంలో… కరెంట్ షాక్ తగిలి చాలామంది యువకులు మరణిస్తున్నారు. గణపతి పండుగ వచ్చిన నేపథ్యంలో చాలామంది ఈ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటివరకు హైదరాబాదులో కరెంట్ షాక్ తగిలి ఏకంగా 10 మంది మరణించారు. ఆరు రోజుల వ్యవధిలోనే పదిమంది మృతి చెందడం గమనార్హం. లేటెస్ట్ గా హైదరాబాదులో మరో వ్యక్తి కరెంటు షాక్ తో దుర్మరణం చెందాడు.
ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన గణేశుడి లారీ.. ట్రాఫిక్ జామ్
హైదరాబాద్-పంజాగుట్ట చౌరస్తాలో ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన గణేశుడి లారీ
ఖైరతాబాద్ నుంచి అమీర్పేట్ వైపు వెళ్తున్న గణేశుడి విగ్రహ లారీ
భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో లారీని బంజారాహిల్స్ వైపుకు మళ్లించిన పోలీసులు pic.twitter.com/fX6uPIOc4E
— BIG TV Breaking News (@bigtvtelugu) August 24, 2025