ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లాలో 250 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. దోడియం, వడ్డిరాల గ్రామాల్లో 1200 ఎకరాల భూమిని ఆ సంస్థకు 33 సంవత్సరాలకు లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐదు సంవత్సరాలకు ఒకసారి 10% లీజు ధర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అటు గుంటూరు నడింపాలెంలో జాతీయ యోగా, నేచురోపతి పరిశోధన సంస్థ ఏర్పాటుకు 12.96 ఎకరాలను ప్రభుత్వం కేంద్రానికి ఉచితంగా కేటాయించింది.