ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా కూడా సోషల్ మీడియా లో క్షణాల్లో ఇట్టే తెలిసిపోతుంది.. అదొక మాయా ప్రపంచం..సరిగ్గా అవసరాలకు వాడేవారు కొందరైతే, దుర్వినియోగం చేసే వాళ్ళు మరికొందరు ఉన్నారు.. సోషల్ మీడియా లో ఒకటైన పేస్ బుక్ ను వయస్సుతో సంబంధం లేకుండా అందరూ వాడుతారు.. మీ ప్రొఫైల్ ను ఎవరైనా చూస్తున్నారా అనే విషయాన్ని మీరు ఇప్పుడు సులువుగా కనిపెట్టవచ్చు.. ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. కానీ ఒక ట్రిక్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. కొన్ని ట్రిక్స్ తో ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
*. ముందుగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ లో ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేసి లాగిన్ కావాలి. అనంతరం పేజీ ఓపెన్ అయిన తర్వాత ‘రైట్ క్లిక్’ చేయాలి. అందులో ‘వ్యూ పేజ్ సోర్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి..
*. వెంటనే పేజీ సోర్స్ కోడ్ ఓపెన్ అవుతుంది. అందులో ‘BUDDY_ID’ కోసం వెతకాలి. ఇందుకోసం కంట్రోల్+ఎఫ్ (ctrl+F) నొక్కి ‘BUDDY_ID’ అని టైప్ చేయాలి.
*. ఇలా ‘BUDDY_ID’ పక్కన అనేక ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఐడీలు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక ఐడీని కాపీ చేసుకోవాలి. అనంతరం కొత్త ట్యాబ్‌ను ఓపెన్ చేసి ‘Facebook.com/మీరు ఎంచుకున్న ఐడీ’ని పేస్ట్ చేయాలి.
*.ఈ ఇవ్వగానే మీ పేస్ బుక్ ప్రొఫైల్ ను ఎవరు చూసారో అనే వారి పేజీ ఓపెన్ అవుతుంది. చూశారుగా.. ఇలా మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారో కూడా వారికి కూడా తెలియకుండా ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు.. ఈ ట్రిక్స్ తప్పుడు ప్రచారాలను కూడా తెలుపుతుంది.. ఇంకా మీకు సమాచారాన్ని ఇస్తుంది..