వడ్డే నవీన్.. 1997 నుంచి దాదాపు ఓ ఐదేళ్ల పాటు సినీప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. వడ్డే రమేష్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు, స్నేహితులు, నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, బాగున్నారా లాంటి సూపర్‌హిట్ సినిమాలతో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు.
అప్పట్లో టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఆయన నటించిన పెళ్లి చిత్రం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ప్రేమించే మనస్సు, మనసిచ్చి చూడు, మా బాలాజీ, చక్రి వంటి సినిమాలు నవీన్‌కు గుర్తింపు తీసుకొచ్చాయి.
అయితే వడ్డే నవీన్ వ్యక్తిగత విషయాల గురించి చాలామందికి తెలియదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయినే ఆయన వివాహం చేసుకున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ కూతురు అయిన చాముండేశ్వరుని వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నారు. అంటే ఆమె జూనియర్ ఎన్టీఆర్‌కు సోదరి వరస అవుతందనమాట. అయితే కొంతకాలానికి వడ్డే నవీన్-చాముండేశ్వరి కొన్ని కారణాల విడిపోయారు.
అయితే వ్యక్తిగత సమస్యల వల్లే నవీన్ కెరీర్ విషయంలో ఇబ్బందులు పడ్డానని, పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారు అంటుంటారు. ఇక ఆ తర్వాత నవీన్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ చివరగా మనోజ్ హీరోగా నటించిన ఎటాక్ సినిమాల్లో కనిపించారు. అసలు వడ్డే నవీన్ సినిమాల్లో ఎందుకు నటించడం లేదని, ఉన్నట్టుండి సినిమాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారో క్లారిటీ లేదు.