మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చే ఈ పాన్ కార్డు ఎన్నో సందర్భాల్లో మనకి అవసరం పడుతుంది. ముఖ్యంగా పెద్ద స్థాయిలో లావాదేవీలు జరపాలంటే పాన్ నెంబర్ తప్పక ఉండాలి.
ఆదాయపు పన్ను చట్టంలోని 114బీ రూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కన్స్యూలర్ ఆఫీసులు తప్ప అందరూ పాన్ కార్డు ఇవ్వాల్సిందే. అయితే ఇంకా దేనికి పాన్ అవసరం పడుతుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే చూసేయండి.
విదేశీ ప్రయాణాలకు రూ.50,000 నగదు చెల్లింపులు లేదా ఫారిన్ కరెన్సీతో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు పాన్ కార్డు ఉండాలి.
కో-ఆపరేటీవ్ బ్యాంక్, బ్యాంకింగ్ కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు.. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అప్లికేషన్ కి పాన్ కావాలి.
హోటల్ లేదా రెస్టారెంట్‌లో ఒకేసారి రూ.50,000 కన్నా ఎక్కువ నగదు చెల్లింపులు చేస్తే అవసరం.
డిపాజిటరీ, పార్టిసిపెంట్, కస్టోడియన్ ఆఫ్ సెక్యూరిటీస్ లేదా సెబీ గుర్తింపు పొందిన సంస్థల నుంచి డీమ్యాట్ అకౌంట్ చేసేటప్పుడు పాన్ కావలి
రూ.50,000 కన్నా ఎక్కువగా డిబెంచర్స్ లేదా బాండ్స్ కొనడానికి చెల్లింపులు చేస్తే కూడా అవసరం.
స్టాక్ ఎక్స్‌ఛేంజ్ నుంచి లిస్టింగ్‌లో లేని కంపెనీకి చెందిన షేర్లు రూ.1,00,000 కన్నా ఎక్కువ కొనేందుకు లేదా అమ్మేందుకు ఒప్పందం చేస్తే కావాలి.
అలానే రూ.50,000 కన్నా ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కొన్నప్పుడు కూడా కావాలి.
RBI జారీ చేసిన బాండ్స్ కొనడానికి రూ.50,000 కన్నా ఎక్కువ చెల్లింపులు చేసినప్పుడు అవసరం.
ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 కన్నా ఎక్కువ నగదు, బ్యాంక్ డ్రాఫ్ట్, పే ఆర్డర్, బ్యాంకర్స్ చెక్ ద్వారా చెల్లింపులు చేస్తే అవసరం.
ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.50,000 కన్నా ఎక్కువ LIC కి పేమెంట్ చేసినప్పుడు కావాలి.
రూ.10,00,000 కన్నా ఎక్కువ లేదా స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకంకి అవసరం.
రూ.1,00,000 కన్నా ఎక్కువ షేర్లు కాకుండా ఇతర సెక్యూరిటీస్ కొనడానికి లేదా అమ్మడానికి ఒప్పందం చేసుకున్నప్పుడు కూడా పాన్ అవసరం.