ఈ పండ్లలో విత్తనాలు పొరపాటున కూడా తినకూడదు తెలుసా..?

-

ఆరోగ్యానికి మంచిది అని తీసుకునేని కూడా కొన్నిసార్లు మన ఆయుష్షను తగ్గిస్తాయి. డైలీ ఒక యాపిల్‌ తింటే డాక్టర్‌ అవసరం లేదు అంటారు.. మరీ ఆ యాపిల్‌తో పాటు అందులో గింజలు కూడా తిన్నారంటే..డాక్టర్‌తో పాటు ఆపరేషన్‌ కూడా అవసరం అవుతుంది. విత్తనాలు నుంచే పండ్లు వస్తాయి. కానీ కొన్ని రకాల పండ్లలో ఉండే గింజలు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పెద్ద విత్తనాలు మనం ఎలాగూ తినం.. చిన్న విత్తనాలు మనకు తెలియకుండానే తినేస్తాం. ఇవి పొట్టలోకి వెళ్లి విషపూరితంగా మారతాయి. అవేంటంటే..

ఆపిల్ పండ్లు

ఆపిల్ విత్తనాలు చాలా విషపూరితం అవుతాయి. తరచూ వాటిని తింటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువ. ఈ విత్తనాలు అమిగ్డాలిన్, హైడ్రోజన్ సైనైడ్‌ను విడుదల చేస్తాయి. ఇవి చాలా ప్రమాదకరమైన రసాయనాలు.

చెర్రీలు

చెర్రీ పండ్లలో కూడా చిన్న విత్తనాలు ఉంటాయి. ఇవి శరీరానికి హానిచేసే సమ్మేళనాలు కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. పీచెస్, ఆప్రికాట్లు, రేగు పండ్లలోని విత్తనాలను కూడా తినకూడదు.

లిచీ

లిచీ పండును అధికంగా తిన్నా అనారోగ్యమే. అలాగే అందులో ఉండే విత్తనాలు ఇంకా డేంజర్‌. వీటిలో ఉండే ఓ రకమైన అమైనో ఆమ్లాల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అమాంతం పెరుగుతాయి. మెదడు వాపు వ్యాధి కూడా వచ్చే అవకాశం కూడా అధికమే.

టొమాటోలు

టమోటాలు వాడకుండా ఏ గృహిణీ ఉండదు. వంటగదిలో ఇవి ఉంటే చాలు ఏదో ఒకటి చేసేస్తారు. టమోటాలో ఉండే లైకోపీన్ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్‌తో పోరాడే లక్షణాలు కూడా అధికం. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే వాటి విత్తనాలు మాత్రం మూత్రపిండాలకు హానిచేస్తాయి. టమోటాలో ఉండే విత్తనాల వల్ల రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. టొమాటోలలో ఉండే ఆక్సలేట్ వల్ల ఇలా రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకూ కట్‌ చేసేప్పుడు టమోటాలో విత్తనాలు తీసేందుకే ప్రయత్నించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version