ఈ జాపనీస్ కాన్సెప్ట్స్ తో.. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవచ్చు తెలుసా..?

-

ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈరోజు లానే ఎప్పుడు ఉండాలని ఎవరు కోరుకోరు. ఎదుగుదల ఉండాలని అనుకున్నది సాధించాలని భావిస్తారు. అయితే మీరు కూడా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నారా అయితే ఈ జపనీస్ కాన్సెప్ట్స్ ని చూడాలి.

ఈ జపనీస్ కాన్సెప్ట్స్ ని అనుసరించడం వలన మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి అవుతుంది. ఫిలాసఫీ కల్చర్ ని చాలామంది నమ్ముతూ ఉంటారు జపనీస్ ఫిలాసఫీలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఇటువంటి గొప్ప విషయాలని ఆచరిస్తే ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి చేరుకోవచ్చు.

కైజన్ (kaizen):

అంటే కంటిన్యూగా ఇంప్రూవ్ అవడం. జీవితంలో ప్రతి దారిలో కూడా ఇంప్రూవ్ అవ్వడానికి చూస్తూ ఉండాలి చిన్న చిన్నగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోగలిగితే పెద్ద మార్పు వస్తుంది.

ఇకిగై (ikigai):

ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన తర్వాత చేసే పనులకి కారణం ఉండాలి. ఎప్పుడూ కూడా మీరు చేసే ప్రతి పని వెనక కూడా పెద్ద కారణం ఉండేటట్టు చూసుకోవాలి. అర్థవంతమైన పనులు భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు.

wabi-sabi (వబి సెబీ):

మీ తప్పులను ఒప్పుకోవడం చాలా ముఖ్యం మీరు చేసే తప్పులని ఒప్పుకుని వాటిని సరిదిద్దుకుంటూ ఉంటే పర్ఫెక్ట్ గా ఉండడానికి అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా పుట్టుకతో పర్ఫెక్ట్ కారు. ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవద్దు. ఇతరులతో పోల్చుకుంటే మనం మనకి తక్కువగా అనిపిస్తూ ఉంటాము. అలానే ఇతరులు నడిచే దారిని చూసి మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దు.

oubaitori (ఔబైఠారి):

కష్టాలప్పుడు డిగ్నిటీ తో ఉండడం చాలా ముఖ్యం. అలానే సహనంతో కూడా ఉండాలి. ఇలా జాపనీస్ కాన్సెప్ట్స్ ని మీరు కనుక అనుసరిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version