పవన్ కల్యాణ్ కోసం అనుకున్న కథలో చిరంజీవి.. కట్ చేస్తే ఆ మూవీ ఇండస్ట్రీ హిట్..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో ‘బావ గారూ.. బాగున్నారా!’ ఎంతటి ఘన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ పిక్చర్ నిజానికి చిరంజీవి చేయాల్సింది కాదట. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఈ మూవీ స్టోరిని అనుకోగా, ఆ తర్వాత జరిగిన పరిస్థితుల వలన ఈ మూవీని చిరంజీవి చేశారు..ఆ పరిస్థితులేంటో తెలుసుకుందాం.

‘బావగారూ..బాగున్నారా!’ చిత్రాన్ని మెగా బ్రదర్ నాగబాబు ప్రొడ్యూస్ చేశారు. నిజానికి చిరంజీవి ..నాగబాబును కూడా హీరోగా చేయాలనుకున్నారు. కానీ, చేయలేకపోయారు. దాంతో నిర్మాతగానైనా నాగబాబు ఎదగాలిన భావించిన చిరు..ఆయన నిర్మాణ సారథ్యంలో పలు సినిమాలు చేశారు. అవి సూపర్ హిట్ అయ్యాయి కూడా. అలా నాగబాబు ప్రొడ్యూసర్ గా చిరంజీవితో సినిమాలు చేస్తున్న క్రమంలో డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ ‘బావగారూ..బాగున్నారా!’ ఫిల్మ్ స్టోరితో వచ్చారు.

‘బావగారూ..బాగున్నారా!’ మూవీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించాలని దర్శకుడు జయంత్ సి.పరాన్జీ భావించారు. కానీ, ఆ టైమ్ లో పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో స్టోరిని చిరంజీవిని వినిపించారు. చిరంజీవి ఓకే చెప్పేసిన క్రమంలో ‘బావగారూ..బాగున్నారా!’ సినిమా తెరకెక్కింది.

ఇక ఈ పిక్చర్ లోని సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మణిశర్మ మ్యూజిక్ అందించగా హీరోయిన్స్ గా రంభ, రచన నటించారు.

మొత్తంగా ‘తమ్ముడు’ పవన్ కల్యాణ్ కు అనుకున్న కథలో ‘అన్నయ్య’ చిరంజీవి నటించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ప్రజెంట్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ఫిల్మ్ చేస్తుండగా, చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version