చిరంజీవికి, విజయేందప్రసాద్‌ కుటుంబానికి మధ్య ఉన్న బంధుత్వమిదే..

-

ప్రజెంట్ ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్నను సినీ పెద్దలను ఎవరిని అడిగినా చెప్పే పేరు రాజమౌళి అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చూసి సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మాస్టర్ స్టోరి టెల్లర్ జక్కన్న అని కొనియాడుతున్నారు. ఈ చిత్రానికి స్టోరిని ఆయన ఫాదర్ విజయేంద్రప్రసాద్ అందించారు.

విజయేంద్రప్రసాద్ తన తనయుడు రాజమౌళికి మాత్రమే కాకుండా ఇంకా పలువురు దర్శకులకు కూడా కథలు అందిస్తుంటారు. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ కు స్టోరి విజయేంద్రప్రసాద్ అందించారు. ఇప్పుడు దీని సీక్వెల్ కు కూడా స్టోరి అందిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ స్టోరి కూడా విజయేంద్రప్రసాద్ అందించగా, ఈ చిత్రం భారత సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటుతోంది ఈ సంగతులు పక్కనబెడితే..విజయేందప్రసాద్ – టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బంధుత్వం ఉందట. ఈ విషయాన్ని విజయేంద్రప్రసాద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో డైరెక్టర్, హీరోలతో పాటు విజయేంద్రప్రసాద్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవికి, తమకు మధ్య ఉన్న బంధుత్వం గురించి తెలిపాడు ‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్ స్టోరి రైటర్. చరణ్-ఎన్టీఆర్ లతో సినిమా తీయడం ద్వారా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా? ఈ రెండు కులాల రిజర్వేషన్లు ఇందుకు పని చేస్తాయా? అని యాంకర్  విజయేంద్రప్రసాద్ ను ప్రశ్న అడిగారు. విజయేంద్రప్రసాద్ సమాధానమిస్తూ తనకు కుల పట్టింపులు లేవని పేర్కొ్న్నారు.

తన భార్యను తాను 1966లో మ్యారేజ్ చేసుకున్నానని, అయితే, ఆమె కులం తనకు ‘ఖైదీ’ చిత్రం విడుదలయినపుడు తెలిసిందన్నాడు. ఆ ఫిల్మ్ రిలీజ్ అయినపుడు తన భార్య మాట్లాడుతూ చిరంజీవి మా వాళ్లే.. మా బంధువే అని అందట. అలా తమ కుటుంబానికి చిరంజీవికి మధ్య దూరపు సంబంధం ఉందన్న విషయం స్పష్టం చేశారు విజయేంద్రప్రసాద్. ఇకపోతే తమ కుటుంబంలోని అమ్మాయిలు కులాంతర వివాహాలు చేసుకున్నారని విజయేంద్రప్రసాద్ తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version