కర్నూలు : కర్నూలులో 12 ఎకరాల్లో ఫిలిం సిటీగా అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నామని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కెఎస్ రామారావు కామెంట్స్ చేశారు… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి RRR సినిమాకు ఎంతో సహకారం అందించారని గుర్తు చేశారు. పెద్ద, చిన్న సినిమాలకు ఏపీ ప్రభుత్వము అండగా నిలిచిందని వెల్లడించారు.
కర్నూలు జిల్లా లో సినిమాకు సంబందించిన అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. కర్నూలు లో సినిమా షూటింగ్, ఫిల్మ్ క్లబ్ ఏర్పాటుకు సినీ పెద్దలు ఆలోచించాలని కోరారు. మఉగాది పండుగ తరువాత ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సినీ పెద్దలను సంప్రదిస్తామని ప్రకటన చేశారు. కర్నూలును సినిమా ఇండస్ట్రీ హబ్ గా చేసేందుకు ముందుకు వెళ్తామన్నారు సినీ నిర్మాత కెఎస్ రామారావు. తుంగభద్ర నది, కెసి కెనాల్, సమ్మర్ స్టోరేజ్, బాలసాయి స్కూల్ అనువైన ప్రాంతాలను గుర్తించామని స్పష్టం చేశారు కెఎస్ రామారావు.