క్యాష్ ప్రోగ్రామ్ కి సుమ పారితోషకం ఎంతో తెలుసా..?

-

ఈటీవీలో ప్రకారమవుతున్న ఎన్నో ప్రోగ్రామ్స్ లో క్యాష్ ప్రోగ్రామ్ కూడా ఒకటి. సంవత్సరాల తరబడి వస్తున్న ఈ ప్రోగ్రాం ఎక్కడా కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టలేదని చెప్పాలి . ఇందుకు కారణం యాంకర్ సుమ చలాకీతనంతో మాటలతో సెలబ్రిటీలను ఆటపట్టిస్తూనే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ ఉంటుంది అందుకే సుమ ఏదైనా ఒక కార్యక్రమానికి యాంకర్ గా చేస్తోంది అంటే అది సంవత్సరాల తరబడి కొనసాగుతూనే వస్తుందని ఆనవాయితీ కూడా ఉంది.. ఇకపోతే తన యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకుని.. క్యాష్ ప్రోగ్రామ్ యొక్క టిఆర్పి రేటింగ్ ను కూడా పెంచుతున్న సుమాకు మల్లెమాల సంస్థ ఎంత పారితోషకం ఇస్తోంది అనే విషయం చాలా వైరల్ గా మారుతుంది.

బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమ పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక అంతేకాదు సినిమా ఈవెంట్లకు ఈమె ప్రత్యేకమైన అతిథి అని చెప్పడంలో సందేహం లేదు. ప్రతిరోజు ఫ్రీ రిలీజ్ వేడుకలు, సక్సెస్ మీట్ అంటూ సుమా ఎంతో బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఇలా బుల్లితెర వ్యాఖ్యాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె క్యాష్ కార్యక్రమాన్ని మాత్రం వదలడం లేదని చెప్పాలి. ఈ కార్యక్రమానికి ఆమె ఎంత పారితోషకం తీసుకుంటుంది అనే విషయానికి వస్తే ఒక్కొక్క ఎపిసోడ్ కు సుమారుగా రూ. 5 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

అంతేకాదు తన స్టాఫ్ ఖర్చులకోసం మరో రూ. 50 వేల రూపాయలు అదనంగా పారితోషకం తీసుకుంటున్నారట. ఈ విధంగా సుమా క్యాష్ కార్యక్రమానికి ఏకంగా రూ.5.50 లక్షల పారితోషకం తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది విన్న మరికొందరు సుమాకు ఉన్న క్రేజ్ కు ఆ మాత్రం ఇవ్వడంలో తప్పులేదు అంటూ కూడా వత్తాసు పలుకుతున్నారు. ఏది ఏమైనా యాంకర్ రంగంలో సుమా తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version