బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

-

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడకలు కొనసాగుతున్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నివాళులు అర్పించారు. అనంతరం బండి సంజయ్ జాతీయ జెండా ఎగురవేశారు.

పటేల్ సాహసోపేత నిర్ణయం వల్ల హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా జరుపుతున్న వేడుకలకు అభినవ పటేల్ కేంద్రహోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వచ్చారని బండి తెలిపారు.

“స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించింది. ఏడాదిపాటు నరకయాతన భరించారు. మహిళలపై వారు చేసిన అకృత్యాలు అత్యంత ఘోరమైనవి. సెప్టెంబర్ 13 న ఆపరేషన్ పోలోను పటేల్ ప్రారంభిస్తే 17వ తేదీన విముక్తి లభించింది. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి ఎందరో మహామహులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. దీన్ని విమోచన దినోత్సవం అంటారు. దీన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎన్నో ఏండ్లుగా పోరాటం చేసింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన తర్వాత కానీ కేసీఆర్ దిగిరాలేదు. దారుస్సలాం నుంచి అనుమతి లభించాకే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిందంటే ఎంత నీచమైన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.” అని బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version