నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల టీడీపీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట చేస్తున్న పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ తో కలిసి తారకరత్న కొద్దిసేపు జనాలతో మమేకం అవ్వడానికి నడవడం మొదలుపెట్టాడు. అలా కొద్దిసేపు వెళ్ళగానే ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా .. అప్పటికే గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం పదిమంది వైద్య బృందంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు పరీక్షించిన తర్వాత అక్కడ విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.
తారకరత్నకు కేవలం గుండెపోటు మాత్రమే కాదు అంతకుమించిన ప్రాణాంతక వ్యాధి కూడా ఉందని వైద్యులు నిర్ధారించారు. అదే మెలేనా.. అయితే తారకరత్నకు వచ్చిన ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? ఎలాంటి చికిత్స చేస్తారు?అనేది ఇప్పుడు చూద్దాం.. మెలేనా అనేది జీర్ణాశయాంతర రక్తస్రావానికి సంబంధించిన ఒక అరుదైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారి మలం జిగటగా , నల్లగా వస్తుంది. అలాగే మెలేనా వల్ల అన్నవాహిక, నోరు, పొట్ట, చిన్న పేగు మొదటి భాగం రక్తస్రావానికి గురి అవుతుంది. కొన్ని కేసుల్లో ఎక్కువ జీర్ణాశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద పేగు యొక్క ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
మెరుగైన చికిత్స ఎలా చేస్తారు అంటే.. పెప్టిక్ అల్సర్స్ ట్రీట్మెంట్, ఎండోస్కోపి థెరపీ వంటి చికిత్సలను చేస్తారని స్పెషలిస్టులు వెల్లడించారు. అలాగే యాంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, సర్జికల్ థెరపీలతోపాటు రక్తాన్ని మార్పిడి చేయడం వంటి చికిత్సలు ఈ వ్యాధి బారిన పడిన వారికి అందిస్తారు అని సమాచారం. సాధారణ పరిస్థితుల్లో మాత్రమే దీనికి ఇలాంటి చికిత్సలు చేయడం వీలవుతుందని.. ఒకవేళ మెలేనా వ్యాధితో బాధపడే వాళ్లకు గుండెపోటు వస్తే రక్తనాళాలలో జరిగే రక్తస్రావం కారణంగా గుండెకు వైద్యం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఈ చికిత్సలో గుండెను కృత్రిమంగా కదిలించేందుకు ఎక్మో మెషిన్లు ఇంప్లాంట్ చేస్తారు. ఇప్పుడు తారకరత్నకు కూడా ఇదే చేస్తున్నారని సమాచారం.