సురక్షితమైన సెక్స్ కోసం కండోమ్స్ వాడుతుంటారు. కండోమ్స్‌లో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా కండోమ్స్‌ను ఎలా చేస్తారో ఆలోచించారా..? కండోమ్స్ తయారీకి వాడే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందట..! అంటే అంత డేంజరెస్ వాటితో కండోమ్ చేస్తారా..? అలా అయితే వాటిని వాడటం డేంజరా..?
కండోమ్స్ తయారీలో రకాలు..
లాటెక్స్: అత్యంత సాధారణంగా కనిపించే రకం లాటెక్స్ కండోమ్‌లు. వాటిని చెట్ల నుంచి తీసిన రబ్బరు పాల మిశ్రమంతో సహజ రబ్బరు ఉపయోగించి తయారు చేస్తారు. ఈ లాటెక్స్ కండోమ్‌లు గర్భాన్ని, లైంగిక వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అలాగే లాటెక్స్ కండోమ్‌ల రేటు కూడా చాలా తక్కువ.
పాలియురేతేన్: రబ్బరు పాలతో తయారు చేసే లాటెక్స్ కండోమ్ ల ద్వారా అలెర్జీ వచ్చే వారు ఈ పాలియురేతేన్‌తో తయారు చేసిన కండోమ్ లు వాడతారు. ఇదో సింథటిక్ పదార్థం. గర్భాన్ని, లైంగిక వ్యాధులను నివారించడంలో లాటెక్స్ కండోమ్స్ లాగే ప్రభావవంతంగా ఉంటాయని సమాచారం. లాటెక్స్ కండోమ్స్ కంటే పాలియురేతేన్ ఖరీదైనవి.
లంబ్‌స్కిన్: గొర్రెల ప్రేగుల లైనింగ్ నుంచి ఈ లంబ్‌స్కిన్ కండోమ్ లు తయారు చేస్తారు. గర్భాన్ని, లైంగిక వ్యాధులను నివారించడంలో లాటెక్స్, పాలియురేతేన్ కండోమ్‌ల మాదిరిగా ఇవి అంత ప్రభావవంతంగా ఉండవు. లంబ్‌స్కిన్ కండోమ్‌లు వేడిని ప్రసారం చేస్తాయి. మిగతా కండోమ్స్ రకాల్లో లేని ఫీచర్ ఇది. కండోమ్ లేకుండా సంభోగం జరిపితే వచ్చే అనుభూతి ఈ లంబ్ స్కిన్ కండోమ్‌లతో లభిస్తుందట… అలా వీటిని కొంత మంది ప్రత్యేకంగా వాడుతుంటారు.
కండోమ్‌లు పర్యావరణానికి హాని కలిగిస్తాయా?
కండోమ్‌లు చాలా కాలం పాటు కరగకుండా ఉంటాయి. ఇవి ప్లాస్టిక్ మాదిరిగా సంవత్సరాల పాటు భూమిలో కరిగిపోకుండా ఉండవు. కండోమ్‌లు నీటిలో కరగనప్పటికీ, భూమిలో పాతిపెడితే కొంత కాలానికి నాశనం అవుతాయి. అలాగే కొన్ని రకాల ఎకో-ఫ్రెండ్లీ కండోమ్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి పూర్తిగా బయోడిగ్రేడబుల్. రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేస్తారు. ఈ రకమైన కండోమ్ లు రబ్బరు అంటే అలెర్జీ ఉన్న వాళ్లు కూడా నిరభ్యంతరంగా వాడొచ్చు. అలాగే కండోమ్ లను రీసైకిల్ చేయలేమని ఇప్పటికే పలు అధ్యయనాల్లో శాస్త్రవేత్తలు తేల్చారు. కానీ రీసైకిల్ పదార్థాలతో కండోమ్ లు తయారు చేయవచ్చు.