మన హిందూ సాంప్రదాయం ప్రకారం భర్తను, భార్య పేరు పెట్టి పిలవకూడదని అంటూన్నారు.. అలా పిలవడం వల్ల ఆయుష్షు తగ్గిపోతుందని అంటున్నారు. కానీ ఈరోజుల్లో మాత్రం యూత్ భర్తను పేరు పెట్టి పిలవడం తో పాటుగా,అరేయ్, ఒరేయ్ అనికూడా పిలిచుకుంటున్నారు..సవాలక్ష ముద్దు పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. అంతేనా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు, ఒకే దగ్గర పెరిగిన బావా మరదళ్లు వంటి వాళ్లు అయితే భర్తను అరేయ్, ఒరేయ్ అని కూడా పిలుస్తున్నారు. కానీ ఇదంతా మన సంప్రదాయం కాదని… అసలు పేరు పెట్టి పిలవడమే భావ్యం కాదని మన పెద్దలు చెబుతున్నారు.
భర్తను పేరు పెట్టి పిలవడం వల్ల ఏదైనా సమస్యలు వస్తాయా? ఎందుకు పిలవకూడదు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..మనం ఏది ఆచరించినా, ఇతిహాసాలు, పురాణాలు, ప్రకారమే సహజీవనం సాగిస్తుంటాం. భర్త భార్యను తండ్రి వంశంతో కూడా సంభోదిస్తుంటాడు. ఉదాహరణకు శ్రీరాముడు సీతను జనకరాజ పుత్రీ అని కూడా పిలుస్తాడు. అలాగే భార్య కూడా పిలవచ్చు. సీతాదేవి శ్రీ రాముడ్ని ఎన్నో సార్లు పేరు పెట్టి పిలిచింది. అది ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే..బయట అందరి ముందు పిలిస్తే అతనికి సమాజంలో గౌరవం ఉండదని అంటున్నారు..
అందుకే మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీ భర్తను ఏమైనా అనొచ్చు కానీ.. ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం ఏమీ అనకూడదు. ముద్దు పేర్లు, తిట్టడాలు వాంటివి కూడా చేయకూడదు. పేరు కూడా పెట్టి పిలవకూడదు. ముఖ్యంగా అత్తింటి వారి ముందు, మీ అమ్మ వాళ్ల ఇంటి ముందు అలా అస్సలే చేయకూడదు. ఒక వేల ఇప్పటి వరకైనా అలా చేస్తే… ఇక మీదట అయినా జాగ్రత్తగా ఉండండి. మరిచిపోయి కూడా మీ భర్తను పేరు పెట్టి పిలవకండి..అతను మన కన్నా వయస్సులో పెద్ద వాడు కావడంతో అతనికి అంత మంచిది కాదట.. ఇది గుర్తుంచుకోండి.. పోరపాటున కూడా భర్తను అలా పిలవకండి..