నయన్ దంపతులు పెళ్లి తర్వాత చేయబోతున్న గొప్ప కార్యం ఏమిటో తెలుసా..?

-

నయనతార.. విఘ్నేష్ శివన్ ఒకరికొకరు గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుని.. ఇప్పుడు ఈరోజు మహాబలిపురంలో ఉన్న షెరటాన్ గ్రాండ్ హోటల్ లో ఉదయం 8:10 గంటల సమయంలో అంగరంగ వైభవంగా విఘ్నేష్ శివన్, నయనతార మెడలో హిందూ సాంప్రదాయం ప్రకారం తాళి కట్టడం జరిగింది. ఇక వీరి వివాహానికి ఎంతో మంది అతిరథమహారధులు.. సినీ ప్రముఖులు. బంధువులు.. స్నేహితులు అందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
ఇకపోతే వీరి వివాహానికి సంబంధించి వీడియోలను నెట్ఫ్లిక్స్ వేదికగా రెండు భాగాలుగా ప్రసారం చేయబోతున్నట్లు సమాచారం. అంతే కాదు నెట్ఫ్లిక్స్ కి నయనతార తమ వివాహ వేడుక వీడియో లను రూ. 2.5 కోట్ల రూపాయలకు అమ్మినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార, విఘ్నేష్ దంపతులు తమ వివాహం అనంతరం ఒక గొప్ప కార్యానికి కంకణం కట్టారు. అదేమిటంటే వీరిరువురు వివాహం పూర్తయింది కాబట్టి ఏకంగా లక్ష మంది అనాధ పిల్లలకు అన్నదానం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఇక సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్క ప్రముఖులు చేయని ఆలోచన ఈ దంపతులు చేసి ఇలా లక్ష మంది అనాధ పిల్లలకు అన్నదానం చేయడం చాలా గొప్ప కార్యం అని చెప్పవచ్చు.

ఇకపోతే నయనతార పెళ్లి కానుక గా విఘ్నేష్ శివన్ ఏకంగా 20 కోట్ల రూపాయల విలువైన అత్యంత ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇవ్వగా.. విగ్నేష్ కూడా రూ.5 కోట్ల విలువైన నగలతో పాటు చీరను కూడా బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. వీరి వివాహానికి చిరంజీవి , రజినీకాంత్ , అజిత్ , షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలు హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version