కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై ఇప్పటికి కూడా విమర్శల పర్వం చల్లారడం లేదు అన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు వ్యవసాయ బిల్లు పై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వ్యవసాయ బిల్లు ద్వారా రైతులందరికీ ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది అంటూ చెబుతోంది. పార్లమెంటు వేదికగా ఉభయ సభల్లో ఆమోదముద్ర పొందిన వ్యవసాయా బిల్లు పై దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అన్ని విధాలుగా లాభం చేకూరే అవకాశం ఉందంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత స్వార్థంతోనే కొంతమంది వ్యక్తులు ఈ వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నారు అంటూ ప్రధాని మోడీ విమర్శలు చేశారు. రైతులు తాము పండించిన పంటను ఇష్టం వచ్చిన చోట అమ్ముకునేందుకు ఈ వ్యవసాయ బిల్లు ద్వారా అవకాశం కల్పిస్తున్నామని… తెలిపిన నరేంద్ర మోడీ… రైతుల కోసం ఈ సంస్కరణలు అత్యంత ఆవశ్యకం అంటూ పేర్కొన్నారు.