ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యేది ఎప్పుడో తెలుసా?

-

ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాల కోసం విద్యార్థులు, తల్లి దండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ ఫలితాలు వచ్చే నెల 15 కు విడుదల కానున్నాయని సమాచారం.ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్‌ కీ విడుదలైన విషయం తెలిసిందే. వివరాల్లోకెళ్తే..ఏపీ ఎంసెట్‌ ఆన్సర్‌ కీ విడుదల.. ఈ లింక్‌ ద్వారా చెక్‌చేసుకోవచ్చు..

ఈ ఎంసెట్ ఫలితాల కీ జులై 12 న మంగళవారం విడుదల అయ్యింది.పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ ఈ నెల 4 నుంచి 12 వరకు జరిగిన విషయం తెలిసిందే. 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌ పరీక్ష.. 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్ష నిర్వహించారు..

ఇందుకోసం రాష్ట్రంలో 120, తెలంగాణలో 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3 లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే.. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో మెరిట్‌ ర్యాంకులు పూర్తిగా సెట్‌ పరీక్షల మార్కుల ఆధారంగానే ఇవ్వనున్నారు. ఇది విద్యార్థులు గుర్తుంచుకోవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version