లాంచ్‌ అయిన Nokia 5710 XA.. పాత ఫోన్‌ కొత్త లుక్‌లో

-

HMD గ్లోబల్ వినూత్నమైన ఫోన్‌ లాంచ్‌ చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ హవా నడుస్తోంది. కీప్యాడ్‌ ఫోన్లను చాలా అరుదుగా వాడుతున్నారు. ఇంట్లో ఉండే అమ్మమ్మలు, తాతయ్యలు మాత్రమే ఇలాంటి ఫోన్లను వాడుతుంటారు. అలాంటిదే ఈ నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ఫోన్‌ విడులైంది. మరీ ఈ ఫోన్‌ విశేషాలేంటో చూద్దామా.!
నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ధర..
ఈ ఫోన్ ధరను 64.99 యూరోలుగా అంటే సుమారు రూ.5,190గా నిర్ణయించారు.
జులై 28వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.
అయితే ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుందో, లేదో తెలియరాలేదు.
ప్రస్తుతం మనదేశంలో నోకియా 105, నోకియా 105 ప్లస్ ఫీచర్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో స్పెసిఫికేషన్లు..
నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో స్మార్ట్ ఫోన్‌లో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేను అందించారు.
యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
128 ఎంబీ స్టోరేజ్ స్పేస్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 1450 ఎంఏహెచ్‌గా ఉంది.
వీజీఏ కెమెరా కూడా ఈ ఫోన్‌లో ఉంది.
డ్యూయల్ సిమ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఫోన్ వెనకవైపు టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్‌ను హైడ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఈ మొబైల్‌కు పెద్ద ప్లస్ పాయింట్.
ఈ ఫోన్‌లో నోకియా ట్రూవైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించనుంది. ఫీచర్ ఫోన్‌ను నోకియా ఇంత అద్భుతంగా డిజైన్ చేయడం విశేషం. కేవలం డిజైన్‌తోనే ఈ ఫోన్ వినియోగదారులను ఆకర్షించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version