2019 గూగుల్ ఇండియా టాప్ 10 సినిమాలేవో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం…..!!

-

ఒకప్పటితో పోలిస్తే నేటి కాలంలో ఇంటర్నెట్ వినియోగం పూర్తిగా ఎక్కువ కావడంతో దేని గురించి వెతకాలన్నా మనకు అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది గూగుల్ అనేది తెలిసిందే. ఇక సినిమాల విషయంలో అయితే యువత మరింత ఎక్కువగా ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎక్కడి వరకు షూటింగ్ జరిగింది, ఎంత కలెక్షన్ రాబట్టింది వంటి తదితరాలన్నీ కూడా గూగుల్ లోఒక్క క్లిక్ చేస్తే చాలు వచ్చేస్తున్నాయి. ఇక కొన్నేళ్లుగా గూగుల్ వారు కూడా మన దేశంలోని సినిమాలపై గట్టిగానే దృష్టిపెట్టడంతో పాటు అప్పటినుండి ప్రతి ఏడాది గూగుల్ లో నెటిజన్లు వెతుకుతున్న టాప్ టెన్ సినిమాల జాబితాను రిలీజ్ చేస్తూ వస్తోంది.

ఆ విధంగా ఈ ఏడాది కూడా రిలీజ్ అయిన సినిమాల టాప్ 10 లిస్ట్ ని గూగుల్ వారు నేడు ప్రకటించడం జరిగింది. అయితే అందులో ఒక షాకింగ్ విషయం ఏమిటంటే, ఆ లిస్ట్ లో మన సౌత్ నుండి ఒక్క సినిమా కూడా లేకపోవడం. కాగా ఆ లిస్ట్ లోని పది సినిమాల్లో 7 బాలీవుడ్, 3 హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ నుండి మహర్షి, సైరా నరసింహారెడ్డి, సాహో, మరియు కోలీవుడ్ నుండి బిగిల్ వంటి దిగ్గజ సినిమాలు ఉన్నప్పటికీ, వాటిలో ఏదీ కూడా గూగుల్ ఇండియాలో స్థానం సంపాదించకపోవడంతో సౌత్ ప్రేక్షకులు దీనిపై కొంత నిరాసక్తిని వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది అయినా మన సినిమాల్లో ఒక్కటైనా టాప్ 10 లో నిలవాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు…

గూగుల్ ఇండియా – 2019 టాప్ 10 సినిమాలు ఇవే… !!

1. కబీర్ సింగ్ –  తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెకెక్కిన ఈ సినిమా జూన్ 21న విడుదలై సుమారు రూ. 300 కోట్ల కలెక్షన్ ను వసూలు చేసి గూగుల్ టాప్ ట్రెండింగ్‌లో నెంబర్ 1 ప్లేస్‌లో నిలిచింది.

2. అవేంజర్స్ ఎండ్ గేమ్ –  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ రాబట్టిన ఈ సినిమా గూగుల్ టాప్ 2 ప్లేస్ లో నిలిచింది. అలానే మన దేశంలో సుమారు రూ.370 కోట్లకు పైగా కలెక్షన్ కొల్లగొట్టింది.

3. జోకర్ –  హాలీవుడ్ సైకాలజీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ‘జోకర్’ సినిమా గూగుల్ ఇండియా టాప్ 3 ప్లేస్ లో నిలిచింది.

4.  కెప్టెన్ మర్వెల్ – ప్రఖ్యాత మార్వెల్ స్టూడియో సంస్థ నిర్మించిన ఈ సినిమా గూగుల్ ఇండియా టాప్ 4లో నిలిచింది. అలానే మన దేశంలో ఈ సినిమా దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్ ని రాబట్టడం జరిగింది.

5. సూపర్ 30 – ప్రముఖ లెక్కల మాస్టర్ ఆనంద్ కుమార్ జీవిత కథ ఆధారంగా హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ఈ సూపర్ 30 సినిమా, మన దేశంలో రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. అంతేకాదు గూగుల్ ఇండియా టాప్ 5 ప్లేస్ లో నిలిచింది.

6. మిషన్ మంగళ్ – అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో ఇస్రో శాస్త్రవేత్తల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మిషన్ మంగళ్’ మూవీ గూగుల్ టాప్ ట్రెండింగ్‌లో ఆరో ప్లేస్‌లో నిలిచింది. కాగా  ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది.

7.  గల్లీ బాయ్ – యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా సహజత్వానికి దగ్గరగా రూపొందిన ‘గల్లీ బాయ్’ సినిమా గూగుల్ టాప్ ట్రెండింగ్‌లో 7 ప్లేస్‌లో నిలిచింది. రూ.150 కోట్లకు పైగా కలెక్షన్ ని రాబట్టడం జరిగింది.

8. వార్ – హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ తొలిసారి హీరోలుగా నటించిన ‘వార్’ సినిమా గూగుల్ టాప్ 8 ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది.

9.హౌస్ఫుల్ -4 – అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ మూవీ గూగుల్ టాప్ 9 ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్ల కలెక్షన్ ను రాబట్టింది.

10. ఉరి – 2016లో జమ్మూ కాశ్మీర్‌లోని ‘ఉరి’ పై ఉగ్ర వాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం, సరిహద్దులు దాటి మరీ చేసిన సర్జికల్ స్ట్రైక్ దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ‘ఉరి’ సినిమా గూగుల్ ట్రెండింగ్‌లో టాప్ 10 ప్లేస్ లో నిలిచింది. ..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version