నిహారిక కి కాబోయే భర్తని చూశారా …?

-

మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్ళి పీటలెక్కబోతుందని తాజా సమాచారం. ఇంకా ఈ విషయంలో అఫీషయల్ గా న్యూస్ రానప్పటికి నిహారిక మాత్రం ఈ రోజు ఉదయం నుంచి తనకి కాబోయో భర్త విషయంలో దాగుడు మూతలు ఆడుతూ వచ్చింది. తన కాబోయో భర్త ని కనుక్కోండి అన్నట్టుగా ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మెగా ఫ్యాన్స్ కి పజిల్ పెట్టింది. దీంతో ఉదయం నుంచి జనాలు ఆ అబ్బాయి ఎవరు .. ఏం చేస్తాడు..ఏ ఫ్యామిలీకి సంబంధించిన కుర్రాడు.. నిహారిక ది లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

 

ఇక తాజాగా నిహారిక తను త్వరలో పెళ్ళాడబోయో అబ్బాయిని రివీల్ చేసింది. జొన్నలగడ్డ వెంకట చైతన్య ని నిహారికా పెళ్లి చేసుకోబోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. గుంటూరు కు చెందిన IG జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య. ఇతను బిట్స్ పిలాని లో గ్రాడ్యుయేట్ చేశాడట. జొన్నలగడ్డ ప్రభాకర్ రావు మెగా బ్రదర్ నాగబాబు కి స్నేహితుడని తెలుస్తుంది. గత కొన్నేళ్ళుగా ఈ రెండు కుటుంబాల మద్య మంచి అనుబంధం ఉందట. మెగా ఫ్యామిలీలో జరిగే శుభకార్యాలకి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు ఫ్యామిలీ తప్పకుండా హాజరవుతుంటారట. ఈ నేపథ్యంలోనే వెంకట చైతన్య నిహారిక కు సరైన జోడీ అని మెగా బ్రదర్స్ ఈ మ్యాచ్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.

 

ఇక ఆగస్టులో వెంకట చైతన్య-నిహారిక నిశ్చితార్థం జరగనుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ రెండు రోజుల్లో మెగా ఫ్యామిలీ నుంచి ప్రకటన రావచ్చని తెలుస్తుంది. ఇక నిహారికా ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో నటిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఆ సినిమాలో నటిస్తుందా లేక డ్రాపవుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version