సితార ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. సాధారణంగా అందరికీ వయసు పెరిగే కొద్దీ అందం తరుగుతూ ఉంటుంది. కానీ ఈయనకు మాత్రం వయసుతో పాటు అందం కూడా పెరుగుతోందని చెప్పవచ్చు. మంచి ఫిజిక్ తో, అభినయంతో అందరిని చూపు తిప్పుకోనికుండా ఇట్టే కట్టిపడేస్తుంటాడు మహేష్ బాబు. ఇకపోతే ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమాతో మహేష్ మరింత గ్లామర్ లుక్కుతో కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈయన కూతురు గారాలపట్టి సితార ఘట్టమనేని కూడా అంతే పాపులారిటీని సంపాదించుకుంది. ఇక తండ్రి వారసత్వం ఉన్నప్పటికీ ఈ పాప మాత్రం తన టాలెంట్ తో మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు.

ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సితార ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు మరొక విషయంలో వైరల్ గా మారుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సితార మాట్లాడుతూ తనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలిపింది. సితార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. సీతారాకు సమంతా అంటే చాలా ఇష్టమని , సమంతతో ప్రతిక్షణం గడపడం చాలా హ్యాపీగా ఉంటుందని కూడా తెలుపుతోంది ఈ చిన్నారి. బ్రహ్మోత్సవం సినిమా సమయంలో తన తండ్రి మహేష్ బాబుతో పనిచేస్తున్నప్పుడు సెట్స్ లో సమంతతో కలిసి సరదాగా గడిపాను అని సితార తెలియజేసింది.

ఇక సితార ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్యామ్ ఆంటీ నాకు మంచి స్నేహితురాలు లాంటివారు.. ఆరేళ్ల క్రితం బ్రహ్మోత్సవం సెట్స్ లో సరదాగా గడిపినప్పుడు సమంతతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం చాలా సరదాగా అనిపించింది అంటూ ఈమె తెలిపింది. ఇకపోతే మే 12న విడుదలైన సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన పాటల ఆల్బమ్ పెన్నీ ప్రమోషనల్ వీడియోలో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఇక తెలుగు చిత్ర సీమలో గత కొంతకాలంగా నటిగా అరంగేట్రం చేయనుందని ప్రచారం కూడా జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version