దేవుడి పూజలో పువ్వులను ఎందుకు వాడతారో తెలుసా?

-

పవిత్రమైన ప్రదేశాలలోకి వెళ్ళినప్పుడు పువ్వులను సమర్పించడం మనం చూస్తూనే ఉంటాము..దేవుడికి పూలను ఎందుకు పెడతారు అనేది చాలా మందికి తెలియదు..కానీ పూజలకు పూలను తప్పనిసరిగా వాడతారు..దీని వెనుక పెద్ద చరిత్ర ఉందని అంటున్నారు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భక్తి పూర్వకంగా నిండు మనస్సుతో ఎవరైతే పుష్పాలను, పండును, జలాన్ని భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారో అలాంటి వారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ భగవానుడు గీతలో వివరించడం జరిగింది..అందువల్ల దేవుని పూజలో పుష్పాలు తప్పనిసరి అని చెప్పడంలో సందేహం లేదు. తామర పువ్వులు, కల్వ పువ్వులు, జాజులు, కనకాంబరాలు నీలాంబరాలు, చామంతి, నందివర్ధములు, పారిజాతాలు, ఎర్రగన్నేరు, మందారం, మంకెన,మునుగోరింట, గరుడవర్ధనం, మాలతి, నిత్యమల్లి వంటి పువ్వులను దేవుని పూజకు పవిత్రమైనవిగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది…

స్వచ్ఛమైన మనసుతో పువ్వును అర్పించడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని కొన్ని శాస్త్రాలలో వివరించడం జరిగింది. స్త్రీలు బహిష్టులైన సమయంలో పూలను తాకరాదు. ఒకవేళ అలా తాకిన వెంటనే పసుపు నీటిని ఆ చెట్టుపై కొంచెం జిమ్మ వలెను. మన భారతదేశంలో ఒక్కరోజులోనే కొన్ని కోట్ల పువ్వు లు దేవునికి సమర్పించడం అనేది విశేషంగానే చెప్పుకోవాలి. బతుకమ్మ పండుగలో బతుకమ్మని కూడా అనేక రకాల పువ్వులతో పేర్చడం గొప్ప నిదర్శనం..స్త్రీలు పూజలు చేస్తున్నప్పుడు తలలో తులసి ఆకులను పెట్టుకోని పూజ చెయ్యడం మంచిదని పండితులు చెబుతున్నారు..ఇది దేవుడికి,పూలకు ఉన్న సంబంధం..అందుకే పూజలకు,అభిషేకాలకు పూలను వాడుతారు..కేవలం పూజలకు మాత్రమే కాదు..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నారు.కొన్ని రకాల సౌందర్య సాధనాలలో,ఆయుర్వేద తైలాలలో కూడా పూలను విరివిగా వాడతారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version