సాధారణంగా మనం ఎప్పుడైనా బంగారాన్ని కొనుగోలు చేస్తే ఆ బంగారం పింక్ కలర్ కాగితంలో చుట్టి ఉంటుంది. అయితే ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా..? ఎందుకు బంగారాన్ని పింక్ కలర్ పేపర్ లో చుట్టి ఇస్తారు అని..? మరి దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో చూద్దాం.
బంగారం, వెండి వంటివి పింక్ కలర్ లో ఉండే కాగితంలో చుట్టి ఇవ్వడం వెనుక పెద్ద కారణమే ఉంది. సాధారణంగా ఇతర రంగు కాగితాలని ఉపయోగిస్తే ఆభరణాలు మనకి కనిపించవు. పింక్ కలర్ లో ఉన్న మెరుపు ఇతర రంగు కాగితాలలో ఉండదు. ఒకవేళ కనుక పింక్ రంగు కాగితం మీద బంగారం పెడితే అది ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంది.
ఒకవేళ కనుక మరో రంగుని ఉపయోగించినట్లయితే బంగారం విలువ కోల్పోయినట్టుగా కనబడుతుంది. అలాగే వెండి కూడా అంతే. పింక్ రంగు కాగితం లో వెండిని పెడితే అది మెరుస్తూ ఉంటుంది. ఈ కారణాల వల్లే బంగారం కొనుగోలు చేసేటప్పుడు పింక్ కలర్ కాగితం లో చుట్టి ఇస్తారు. అలానే ఆస్పత్రి లో ఆపరేషన్ చేసే సమయం లో డాక్టర్లు ఆకుపచ్చ రంగు ని వాడతారు.
దీనికి గల కారణం ఏమిటంటే నీలం కానీ ఎరుపు కాని లేదా ఇతర రంగులు కానీ ఉపయోగిస్తే రోగి వైద్యుల మానసిక స్థితుల పై ఆ రంగుల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలానే ఆకుపచ్చ రంగు మీద రక్తం మరకలు పడిన భయంకరంగా కనబడదు. ఆకుపచ్చ అనేది చాలా లైట్ గా ఉంటుంది అందుకే రోగిని భయపెట్టదు. కాబట్టి ఆకుపచ్చ రంగుని వాడతారు వైద్యులు.