పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ లో జరిగిన హత్యాకాండపై జీరో అవర్ నోటీస్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రూపా గంగూలి. ఈ హత్యాకాండపై పార్లమెంట్ లో ప్రస్తావించారు ఆమె. భీర్భూమ్ ఘటనపై బీజేపీ ఎంపీ త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఒకింత భావొోద్వేగానికి గురై బోరున ఏడ్చేశారు. కేవలం 8 మందే మరణించారని చనిపోయారని అక్కడ ప్రభుత్వం చెప్పడం దారుణమి… బెంగాల్ ప్రజలు సంతోషంగా లేరని.. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. బెంగాల్ లో సామూహిక హత్యలు జరుగుతున్నాయని.. ప్రజలు తమ సొంత స్థలాల నుంచి పారిపోతున్నారని.. రాష్ట్రంలో జీవించలేకుండా ఉన్నారని ఆమె పార్లమెంట్ లో ఆవేదన వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ లో ప్రజలు మాట్లాడలేరని.. హంతకులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలను చంపే ప్రభుత్వం మరొక రాష్ట్రంలో లేదని రూపా గంగూలీ విమర్శించారు. ఇటీవల త్రుణమూల కాంగ్రెస్ లోని ఓవర్గం మరో వర్గం గత సోమవారం బీర్భూమ్ లో ఇళ్లకు నిప్పు పెట్టడంతో 8 మంది సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతం ఈ కేసుపై కోల్ కతా హైకోర్ట్ ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. రాంపూర్ హట్, బీర్ భూమ్ కేసలో ఎప్రిల్ 7 లోగా నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది.