వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండ వేడి తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఏసీ లోనే ఉంటూ ఉంటారు. అయితే నిజానికి ఏసీలు లో ఎక్కువసేపు ఉండటం వల్ల సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అందుకని వీలైనంత వరకూ ఏసీలకు దూరంగా ఉండటం మంచిది. 24 గంటలు ఏసీలో ఉంటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మరి ఎలాంటి సమస్యలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం.
ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది:
ఏసీ లలో ఎక్కువ సేపు ఉండటం వల్ల మనకి తెలియకుండానే నెగటివ్ ప్రభావం పడుతుంది. చల్లగా టెంపరేచర్ ఉండడంవల్ల ఎనర్జీని అసలు ఉపయోగించకుండా అయిపోతారు. ఈ కారణంగా ఒబిసిటీ సమస్యకు దారితీసే అవకాశం ఉంది.
జాయింట్ పెయిన్స్ సమస్య:
ముఖ్యంగా ఏసీలలో ఎక్కువగా ఉండే వాళ్లలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. పెద్ద వారికి అయితే మరీను. ఏసీలలో ఉండడం వల్ల టెంపరేచర్ తగ్గి మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ వంటివి కలిగిస్తుంది. ఇలా ఎముకల సమస్యతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
బీపీ మరియు ఆస్తమా సమస్య:
మీకు బీపీ ఉండి ఎక్కువసేపు ఏసీలో ఉంటే ఆస్తమా కి దారి తీసే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ సేపు ఏసీలో ఉండటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కోవాలి.
నీరసం మరియు జ్వరం:
ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల నీరసం మరియు జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి.
చర్మ సమస్యలు వస్తాయి:
ఎక్కువ సేపు ఏసీ గదుల్లో ఉండడం వల్ల చర్మ సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఇన్ని సమస్యలు మనకి ఏసీ గదులలో ఉండడం వల్ల రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి.