శృంగారం… ప్రేమలో ఉన్న ప్రతీ ఒక్కరికి కూడా శృంగారం అనేది చాలా అవసరమని కొందరు అంటే నిజమైన ప్రేమకు దానికి సంబంధం ఏంటీ అనే వారు మరికొందరు. అసలు ప్రేమలో శృంగారం వలన కలిగే మార్పులు ఏంటీ అనేది కొందరి ప్రశ్న. దీనికి మనలోకం మీకు సామాజిక కోణంలో ఆలోచించి ఒక సమాధానం చెప్తుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా సరే భారతీయుల ఆలోచనా విధానం ప్రకారం ఆలోచించి మేము ఒకటి చెప్తాం మీకు.
మా అభిప్రాయం ప్రకారం ప్రేమలో శృంగారం అనేది చాలా కీలకం. అవును అసలు నిజమైన ప్రేమలో శృంగారం లేకపోతే మానసికంగా దగ్గరకావడం అనేది చాలా కష్టం. నిజమైన ప్రేమ అన్నప్పుడు శృంగారం ఎందుకు అంటారా…? ప్రేమలో నీకు నేను ఉన్నా అని చెప్పడం వేరు నీలో నేను ఉన్నా అని చెప్పడం వేరు, నువ్వు నా సొంతం, నువ్వు నాలో అంతర్భాగం అని చెప్పడం వేరు.
నువ్వు నాలో అంతర్భాగం అనే భావన ఒకరి మీద ఒకరికి ఎప్పుడు వస్తుందో తెలుసా…? ప్రేమించిన వ్యక్తిని శారీరకంగా అనుభవించినప్పుడు. శారీరకంగా ఆ మనిషిని నువ్వు ఎప్పుడైతే అనుభవించలేవో… ఇద్దరి మధ్య భావోద్వేగాలకు ఒక గ్యాప్ ఉంటుంది. అర్ధం కాలేదా…? భావోద్వేగాలలో గ్యాప్ అంటే ప్రేమించిన మనిషికి మానసికంగా దగ్గర కావడం అనేది జరగదు. ఎప్పుడైతే మీ పక్కలో ప్రేమించిన అమ్మాయి, లేదా అబ్బాయి ఉంటాడో మీ ప్రేమకు ఉండే హద్దులు చెరిగిపోతాయి.
ఆ సమయంలో మీ మనసులో ఉండే భావాల్లో చాలా వరకు బయటకు వచ్చి మీరు ఏంటీ అనేది ప్రేమించిన వ్యక్తికి స్పష్టంగా అర్ధమవుతుంది. దాచుకునే వాళ్లకు ఇది వర్తించదు. అందుకే నిజమైన ప్రేమ అనే పధం ప్రస్తావించాం. నిజమైన ప్రేమలో దాపరికాలు ఉండవు. శృంగారం చేసిన తర్వాత నిజంగా పేరు ఆ మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి మీ మనసులో నుంచి దూరం కావడం అనేది చాలా కష్టం.
అందుకే నిత్యం శృంగారం చేసే భార్యా భర్తలు సంతోషంగా ఉంటారు అని ఒక సర్వే కూడా చెప్పింది. శృంగారం మీరు ఎప్పుడైతే చేస్తారో ఆ రోజు మీ ప్రేమకు ఒక కొత్త జీవితం మొదలవుతుంది. అప్పటి వరకు మీలో ఉండే ఫీలింగ్స్, భావోద్వేగాలు అన్నీ కూడా అదుపులో ఉంటాయి. ఆ తర్వాత అవి అదుపులో ఉండే అవకాశం ఉండదు. మనస్పూర్తిగా శృంగారంలో పాల్గొనే ప్రేమికుల్లో ఒకరిమీద ఒకరికి అంతులేని ప్రేమ ఉంటుందట.
మానసికమైన ఒత్తిడిని తగ్గించడమే కాక మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఇద్దరిలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినా వెంటనే సర్దుకుపోతుంటారట. డిప్రెషన్, ఆందోళన దరిచేరవు. శృంగారం వల్ల విడుదలయ్యే ఎండార్పిన్లు ఆనందంగా ఉండే విధంగా చేస్తాయి. కాబట్టి ప్రేమలో శృంగారం అనేది చాలా అవసరం. ఒకరికి ఒకరు దూరమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కోప తాపాలను కూడా అదుపు చేసుకునే అవకాశం ఉంటుంది.