తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు.కళ్యాణ లక్ష్మి పథకాన్ని వడ్డీ వసూలు స్కీంగా మార్చడానికి సిగ్గులేదా? ప్రశ్నించారు. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక రికవర్సీ ఏజెన్సీని నడుపుతున్నారా? అని ఫైర్ అయ్యారు. ఓ మహిళ తన కూతురు పెళ్లి అనంతరం తన ఖాతాలో పడిన కళ్యాణ లక్ష్మి సొమ్మును పంటరుణం కింద బ్యాంకు అధికారులు జమ చేసుకోవడంపై శనివారం ఉదయం ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
‘ఆడబిడ్డ పెళ్లి చెయ్యడం కష్టం కావొద్దని, కేసీఆర్ తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని వడ్డీ వసూలు స్కీంగా మార్చడానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు.కల్యాణ లక్ష్మి కింద వచ్చిన లక్ష రూపాయలలో 60 వేలు బ్యాంకుకి, 40 వేలు లబ్ధిదారునికా?, నువ్వు నడిపేది ప్రభుత్వమా? రికవరీ ఏజెన్సీనా? అని నిలదీశారు. సోంబాయి కన్నీటికి కారణం ఎవరు అని! కేటీఆర్ అడిగారు. దందాలు, వసూళ్లు మాత్రమే తెలిసిన రేవంత్ కి ఒక చిన్న సలహా! అంటూ.. కనీసం ఆడపిల్ల పెళ్లి డబ్బుల జోలికి పోవద్దు! వినడానికే అసహ్యంగా ఉంది!’అని కేటీఆర్ రాసుకొచ్చారు.