కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ పార్టీలో చేరారు మేయర్ సునీల్ రావు. ఈ తరుణంలోనే… కండువా కప్పి పార్టీలోకి మేయర్ సునీల్ రావు ను ఆహ్వానించారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
మేయర్ సునీల్ రావు తో పాటు బీజేపీ లో చేరారు శ్రీదేవి చంద్రమౌళి, లెక్కల స్వప్న వేణు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తీవ్రస్థాయిలో అవినీతి పెరిగి పోయిందని, అది భరించలేకే తాను పార్టీని వీడతున్నానని కామెంట్ చేశారు. రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ, ఇతర పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ముఖ్యంగా ఓ అవినీతి నేత పేరును త్వరలోనే బయటపెడతానంటూ హాట్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్లో ఉన్న ప్రతి నాయకుడి అవినీతి చిట్టా తన వద్ద ఉందని హెచ్చరించారు.