కరీంనగర్ మేయర్ సునీల్ రావు సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత.. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నుంచి వచ్చినప్పటికీ ఇప్పటికీ నీ పరిస్థితి ఏంటి? నీ భాగోతం బయట పెడుతా బిడ్డా అంటూ హెచ్చరించారు. కమిషన్లు ముడితే చాలు.. ఆ తర్వాత గంగుల కనిపించడని ఆరోపణలు చేశారు. కరీంనగర్ లో జరిగిన ప్రతీ కుంభకోణం వెనక గంగుల పాత్ర ఉందని… బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ నగర అభివృద్ధన్నారు.
వినోద్ ను ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నేనే చెప్పానని… పోటీ చేస్తే బండి సంజయ్ ను తట్టుకోలేవని చెప్పానని గుర్తు చేశారు. బ్యాంకాక్, శ్రీలంకలో పత్తాలాడే సంస్కృతి గంగులదని… డ్రైనేజీ నీళ్ళు మళ్ళించకుండా మానేరు రివర్ ఫ్రంట్ పేరిట 200 కోట్లు వృథా చేసారని ఆగ్రహించారు. నగర అభివృద్ధి ఆగిపోవద్దని నేను ఇంతకాలం సైలెంట్ గా ఉన్నానని చెప్పారు. చెక్ డ్యామ్ లు, రోడ్ల కాంట్రాక్టర్లంతా గంగుల బినామీలే అని ఆరోపణలు చేశారు. నాకు మేయర్ పదవి రాకుండా గంగుల ఆనాడే అడ్డు పడ్డాడని ఫైర్ అయ్యారు.