విస్కీ తయారీలో మొక్కజొన్నని వాడుతారా..!

-

మొక్కజొన్నని ఇష్టపడని వారంటూ ఉండరు. ఇక వర్షాకాలంలో చాల మంది ఉడికించిన మొక్కజొన్నకు ఉప్పు, కారం పెట్టుకొని తింటారు. అయితే మొక్క జొన్నను తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనం టైంపాస్‌కి తినే మొక్కజొన్న కంకిలో ఎన్ని పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Sweet-Corn

అయితే మొక్కజొన్నలో విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహంలో ఎర్రరక్త కణాలను ఉత్పత్తికి ఎంతో సహాయపడతాయి. ఒక కప్పు మొక్కజొన్న గింజల ద్వారా 125 క్యాలరీలు, 27 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 4 గ్రాముల ప్రొటీన్లు, 9 గ్రాముల సూక్రోజు, రెండు గ్రాముల కొవ్వు, 75 మిల్లీగ్రాముల ఐరన్‌ లభిస్తుంది. అథ్లెటిక్‌ క్రీడాకారులకు, జిమ్‌లో చెమటలు చిందించేవారికి ఇది శక్తిదాయకంగా పనిచేస్తుంది. మొక్కజొన్నలో బి విటమిన్‌ కుటుంబానికి చెందిన బి1, బి5లతో పాటు విటమిన్‌ సి కూడా ఉంటుంది.

ఇక మొక్కజొన్నలో ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, ఐరన్‌, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు పొటాషియం, కాల్షియం కూడా తగు పరిమాణంలో లభిస్తాయి. అందువల్ల బీపీ, గుండె జబ్బులు, అల్జీమర్స్‌ వంటి వ్యాధులను నివారిస్తుంది. సోడియం తక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యలు ఉన్నవారికి, రక్తపోటు ఉన్నవారికి మొక్కజొన్న చాలా మంచి పుడ్.

అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ కూడా మధుమేహం సమస్య ఉన్నవారికి మొక్కజొన్న మేలు చేస్తుందని ప్రకటించింది. రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో మొక్కజొన్న ఉండేలా చూడాలని వైద్యులు చెబుతున్నరు. విటమిన్‌ బి1, బి5, విటమిన్‌ సి సమృద్ధిగా ఉండటంవల్ల వ్యాధులపై పోరాడటంలో ఉపయోగం ఉంటుంది. కొత్త రక్త కణాల ఉత్పత్తికి కూడా దోహదం చేస్తున్నందున రక్తంలో షుగర్‌ స్థాయులు తగ్గిపోతాయి. మధుమేహులకు ఇది మేలు చేస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.

గర్భిణులు మొక్కజొన్న తినడం వలన మేలు ఇంతా అంతా కాదు. గర్భిణికి, గర్భస్త శిశువుకు కూడా మొక్కజొన్న వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. మొకజొన్న గింజలను విస్కీ తయారీలో కూడా విరివిగా వినియోగిస్తున్నారు. మొక్కజొన్నను బయోగ్యాస్‌ ప్లాంట్లలో వినియోగిస్తున్నారు. మోటారు వాహనాలకు ఇంధన తయారీలో ఎథనాల్‌గా దీనిని వినియోగిస్తారు. ఇంకా అనేక పారిశ్రమిక ఉత్పత్తులో కూడా మొక్కజొన్న వినియోగం గణనీయంగా ఉంటోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version