సాధారణంగా బయట ఉద్యోగం చేసిన లేదా ఇంట్లో పనులు చేసుకున్నా చాలా వేగంగా చేసుకోవాల్సి వస్తుంది. అయితే హర్రీ హర్రీగా పనులు చేసుకుంటే కొంచెం ఏదోలా ఉంటుంది. ప్రశాంతంగా నెమ్మదిగా చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అలాంటిది వేగంగా పనులు పూర్తి చేసుకుంటూ ఉంటే కష్టం కూడా. అయితే మీ పనులు మీరు నెమ్మదిగా ఎలా చేసుకోవాలి అనే దాని కోసం కొన్ని టిప్స్. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసి ఈ టిప్స్ ని ఫాలో అయిపోండి.
నో చెప్పడం నేర్చుకోండి:
సాధారణంగా చాలా మంది నో చెప్పడం చెయ్యరు. నేను చేయను, నాకు టైం లేదు లాంటివి చెప్పకుండా ఎంత కష్టమైన పనినైనా స్వీకరిస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని పనులు మీ నెత్తిన పడతాయి. ఆఫీస్ లో అయినా ఇంట్లో అయినా సరే కొన్ని కొన్ని సార్లు నో చెప్తే మీరు ప్రశాంతంగా మీ పనులు పూర్తి చేసుకోగలరు.
బ్రేక్ తీసుకోవడం:
ఎప్పుడైనా ఒక పని నుంచి మరొక పని మొదలు పెట్టేటప్పుడు చిన్న బ్రేక్ తీసుకోవడం నేర్చుకోండి. దీని వల్ల మీ బ్రెయిన్ మరింత వేగంగా పని చేస్తుంది. మీ బ్రెయిన్ కి రీఛార్జ్ అయితే మీరు మీ పనులు ప్రశాంతంగా, చురుకుగా చేసుకోవచ్చు.
ఆలస్యం అయిపోతుందేమో అని చింతించకండి :
చాలా మందికి ఈ చెడ్డ లక్షణం వుంది. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆలస్యం అయిపోతుందేమో అని మరింత వేగంగా చేయడానికి పూర్తి చేస్తారు. ఇలా ట్రై చేసే క్రమంలో పర్ఫెక్షన్ కూడా పోతుంది. కాబట్టి ఎప్పుడూ ముందుగానే భయపడి పోకండి.
మీకు మీరే నెమ్మదిగా చేయాలి అని చెప్పుకోండి;
వేగంగా చేయకుండా మీరు మిమ్మల్ని స్లో చేయడానికి ప్రయత్నించండి. ఇలా నెమ్మదిగా చేయడం వల్ల పని పర్ఫెక్ట్ గా అవుతుంది. అలానే మీకు ప్రశాంతంగా కూడా ఉంటుంది.