యువతులతో న్యూడ్ చాటింగ్.. 70 లక్షలు పోగొట్టుకున్న డాక్టర్ !

-

అతనో డాక్టర్, హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ, కాస్త సరదా తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పలు డేటింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేశాడు. అదే అతని పాలిట శాపంగా మారింది.  ఇప్పటి వరకు యువతులతో న్యూడ్ చాటింగ్ లో 70 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆయన డేటింగ్ అప్ లో యువతులతో చాటింగ్ చేస్తూ మోస పోయిన క్రమంలో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో డాక్టర్ రమేష్ ను మోసం చేసిన  కేసులో ఇద్దరు సైబర్ నేరగాళ్లను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నోయిడా ఉత్తర ప్రదేశ్ కు చెందిన చౌదరి, ఉమేష్ యాదవులను పోలీసులు రిమాండ్ తరలించారు.

వాట్స్ అప్ జుగల్ ఆప్ లో గతంలో యువతితో  వైద్యుడు రమేష్ న్యూడ్ చాటింగ్ చేసిన క్రమంలో దానిని రికార్డ్ చేసి డబ్బు ఇమ్మని డిమాండ్ చేశారు. అలా పలు దఫాలుగా 70 లక్షలు లాగారు. ఇంకా లాగాలని చూడడంతో రమేష్ కు ఇటీవల వేధింపులు అధికం అయ్యాయి, దీంతో సిసిఎస్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నోయిడాలో తలదాచుకుని ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version