ఫూట్ గా తాగిన మందుబాబు కు మరో 15 కేన్ల బీరును పొట్టలోకి పంప్ చేసిన వైద్యులు

-

ముల్లును ముల్లు తోనే తీయాలి అనే సామెత వినే ఉంటారు. అలాంటి సామెత లాగానే ఒక వ్యక్తి వ్యవహారం జరిగింది. కేన్ల కొద్దీ బీరును లాగించేసే అతడి శరీరంలో మిథనాల్ స్థాయి భయంకరంగా పెరిగింది. దీనితో ఏమి చేయాలో అర్ధం కానీ వైద్యులు ఇలా ముల్లును ముల్లు టోన్ తీయాలి అన్నట్లుగా అతడి శరీరంలోకి 15 కేన్ల బీరును ఆ మందుబాబు పొట్టలోకి పంప్ చేశారు. అయితే ఆ మందుబాబు బ్రతికి బట్టకట్టడం తో డాక్టర్లు నమ్మిన సిద్ధాంతం ఫలించినట్లు అయ్యింది. వివరాల్లోకి వెళితే… వియత్నాం లోని క్వాంగ్త్రికి చెందిన గువన్ వాన్ నహత్ అనే 48 ఆసామి ఫుల్లుగా బీర్లు వేయడం లో మంచి దిట్ట. ఎంతగా అంటే అతడి ఒంట్లో ఉండాల్సిన మోతాదు కంటే 1119 రేట్లు మద్యం ఎక్కువగా ఉందట. దీనితో అతడి కాలేయం పూర్తిగా పనిచేయడం మానేసింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ తాగుబోతు కు రక్షించడానికి వైద్యులకు మరో దారి లేక ముల్లును ముల్లు తోనే తీయాలి అన్న సామెత గుర్తకు వచ్చి మిథనాల్ ద్వారా కడుపులో ఏర్పడే యాసిడ్ ను ఇథనాల్ నియంత్రిస్తుంది అని నమ్మిన వైద్యులు చివరికి ఆ ఉపాయం చేశారు.

అయితే ఇది కొంచం రిస్క్ తో కూడుకున్నప్పటికీ సక్సెస్ అయితే మాత్రం రోగి బట్టగట్టే అవకాశాలు ఉన్నాయి. దీనితో రోగిని కాపాడడానికి మరోదారి లేక వైద్యులు దాన్నే ఎంచుకున్నారు. అయితే చివరికి అది సక్సెస్ అవ్వడం తో అతడు కాస్త బతికి బట్టకట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version