ఐస్ క్రీమ్ లిక్ చేశాడని ఏకంగా రూ.75 వేల జరిమానా

-

యువత ఒక్కొక్కసారి తుంటరి పనులతో తలనొప్పులు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి ఒక ఘటనే అమెరికా లో చోటుచేసుకుంది. సరదాగా సూపర్ మార్కెట్ కు ఆడ్రీన్ ఆండర్సన్ అనే 24 ఏళ్ల యువకుడు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాడు. అయితే అక్కడ ఎవరూ చూడలేదు అనుకోని ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఓపెన్ చేసి లిక్ చేసి తిరిగి ఎక్కడ నుంచి తీశాడో అక్కడే పెట్టేశాడు. అయితే అది కాస్త అతడి ఫ్రెండ్స్ వీడియో తీశారు,అంతటితో చాలదు అన్నట్లు ఆ వీడియో ను తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అది కాస్త వైరల్ గా మారింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని వాల్ మార్ట్ సూపర్ మార్కెట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ వీడియో చూసిన వాల్ మార్ట్ సిబ్బంది ఆ యువకుడిపై ఫిర్యాదు చేయడం తో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. అయితే కోర్టు ఈ వీడియో చూసి ఆ యువకుడికి గట్టి షాక్ ఇచ్చింది. ఎవరూ పెట్టుకోరు అనుకోని అతడు చేసిన తుంటరి పనికి అమెరికా కోర్టు అతడికి ఊహించని విధంగా శిక్ష ను విధించింది.

డబ్బులు కట్టకుండా ఐస్ క్రీమ్ సగం తిని మిగిలిన దాన్ని అలానే వదిలేసినందుకు ఏకంగా 30 రోజుల జైలు శిక్ష,రూ.75 వేల జరిమానా విధించింది. మొత్తానికి ఎదో సరదాగా చేసిన చిన్న పనికి ఆ యువకుడి కి భారీ జరిమానా తో పాటు 30 రోజుల జైలు శిక్ష విధించింది. అయితే ఈ ఘటనపై వాల్ మార్ట్ కూడా స్పందించింది. కస్టమర్స్ ఇలాంటి పనులు చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని, ఇది ఎదో సరదా గా చేసే పని కాదని దీనిని జోక్ తీసుకోలేమని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version