దేశంలోని విద్యార్థులంద‌రికీ కేంద్రం ఉచితంగా స్మార్ట్ ఫోన్లు..? నిజ‌మెంత‌..?

-

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఉన్న అనేక స్కూళ్లు, కాలేజీలు, యూనివ‌ర్సిటీలు విద్యార్థుల‌కు ఆన్ లైన్‌లో క్లాసుల‌ను మొద‌లు పెట్టాయి. క‌రోనా ప్ర‌భావం ఇంకా ఎప్ప‌టికి త‌గ్గుతుందో తెలియ‌దు. దీంతో విద్యార్థులు ఈ సంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుండా ఉండేందుకు గాను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆన్ లైన్ త‌ర‌గ‌తుల‌కు అనుమ‌తులు ఇస్తున్నాయి. అయితే ఈ నేప‌థ్యంలోనే కేంద్రం దేశంలోని విద్యార్థులంద‌రికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్ల‌ను అందిస్తుందంటూ కొన్ని వార్త‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

దేశంలోని విద్యార్థులంద‌రికీ మోదీ ప్ర‌భుత్వం ఉచితంగా స్మార్ట్ ఫోన్ల‌ను అందిస్తుంద‌ని, దీంతో వారు ఆన్ లైన్ క్లాసుల‌కు హాజ‌రు కావ‌డం సుల‌భ‌త‌రం అవుతుంద‌ని, ఆ ఫోన్లు కావాలంటే మెసేజ్ లో ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయాల‌ని.. ప‌లు మెసేజ్ లు చాలా మందికి వ‌స్తున్నాయి. అయితే ఈ మెసేజ్‌ల‌లో ఎంత మాత్రం నిజం లేద‌ని వెల్ల‌డైంది. కేంద్రం స్టూడెంట్లు ఎవ‌రికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్ల‌ను ఇవ్వ‌డం లేద‌ని తేలింది. క‌నుక ఆ మెసేజ్ లు, వార్త‌ల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని తెలియ‌జేసింది.

పీఐబీ (ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కేంద్ర ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు ఉచితంగా స్మార్ట్ ఫోన్ల‌ను ఇస్తుంద‌నే వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. ఎవ‌రూ ఆ వార్త‌ల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని, ఆ వార్త‌కు చెందిన మెసేజ్ లు ఏవైనా వ‌స్తే.. వాటిలోని లింక్ ల‌ను క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version