తాత, తండ్రి ఆస్తిలో అమ్మాయికి 50% హక్కుంటుందా?

-

సాధారణంగా తండ్రి, తాత, ముత్తాత సంపాదించిన ఆస్తికి వారసుడు కొడుకే. కూతుళ్లకి పెళ్లి చేసి పంపించేస్తే చాలు. ఇక మిగిలిన ఆస్తి అంతా కొడుకులే అనుభవిస్తారు. కూతురుకు దాంట్లో చిల్లిగవ్వపై కూడా హక్కు ఉండదు. కానీ.. ఇటీవల కొన్ని చట్టాలు వచ్చాయి.. అవి కూతుళ్లకు కూడా అనుకూలంగా ఉన్నాయి. అంతే కాదు.. ఢిల్లీ హైకోర్టు కూడా ఓ కేసులో అరుదైన తీర్పును చెప్పింది. అది అమ్మాయిలకు అనుకూలంగా.

ఢిల్లీలో నివసించే ఓ వ్యక్తి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత జరిగిన ఆస్తి పంపకాల్లో చిన్న గొడవలు జరిగాయి. నిజానికి చనిపోయిన వ్యక్తికి ఉన్న భార్య, పిల్లలకు ఆస్తి సమానంగా రావాలి. భార్యకు సగభాగం.. మిగితా సగభాగం పిల్లలకు. పిల్లల్లో ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి ఉన్నారు. అయితే.. కూతురుకు ఇవ్వాల్సిన వాటాను ఇవ్వడానికి ఆమె సోదరుడు ఒప్పుకోలేదు. దీంతో ఆమె కోర్టుకెక్కింది. ఈసందర్భంగా కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు హిందూ వారసత్వ చట్టం ప్రకారం తీర్పును వెలువరించింది. చనిపోయిన వ్యక్తి భార్యకు, కూతురుకు కూడా ఆస్తిపై సమాన హక్కు ఉంటుందని వెల్లడించింది. దీంతో కూతురుకు కూడా తండ్రి ఆస్తిలో వాటా వస్తుందన్నదానిపై చర్చ ప్రారంభమైంది.

2005కు ముందు.. 2005 తర్వాత ఆస్తి పంపకాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఒక్క విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. 2005లో చట్టాన్ని సవరించారు. తండ్రి ఆస్తిపై కొడుకు, కూతురుకు సమాన హక్కు కల్పించారు. అంటే తండ్రి తన ఆస్తిని కొడుకుతో పాటు కూతురుకు కూడా సమానంగా పంచాలి. తన స్వార్జితం, పిత్రార్జితం ఆస్తిపై కూడా వాళ్లకు హక్కు ఉంటుంది.

2005కు ముందు చేసిన ఆస్తి పంపకాల్లో మాత్రం కూతురుకు తండ్రి ఆస్తిపై హక్కు ఉండదు. ఒకవేళ ఎవరైన తన భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం… అప్పుడు రెండో భార్యకు, ఆమె పిల్లలకు కూడా అతడి ఆస్తి(స్వార్జితం) లో వాటా లభిస్తుంది. కానీ.. అతడి పిత్రార్జితంలో వాళ్లకు వాటా ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version