బీఆర్ఎస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బీఆర్ఎస్ జాతకాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. అవి చెబితే ఎవరూ తట్టుకోలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసి సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని అన్నారు అసదుద్దీన్. తాము కాంగ్రెస్ పార్టీతో జతకట్టామని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందని.. కానీ గతంలో తమ మద్దతుతోనే మీరు గ్రేటర్ ఎన్నికలలో గెలిచారు కదా..? అని ప్రశ్నించారు.
ఇక టీటీడీ బోర్డు నూతన చైర్మన్ బి.ఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు అసదుద్దీన్. టిటిడి బోర్డు లోని 24 మంది సభ్యులలో అందరూ హిందువులే ఉండాలని, అదేవిధంగా ఆలయంలో పనిచేసే వాళ్ళలో అన్యమతస్తులు ఉండకూడదు అంటూ టిటిడి బోర్డు చైర్మన్ స్టేట్మెంట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. బి.ఆర్ నాయుడు వ్యాఖ్యలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు అసదుద్దీన్.
తిరుమల ఆయన జాగిరు కాదని ఫైర్ అయ్యారు. అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను నియమించేలా బిల్లులు బిల్లులు ఎలా తెస్తారని ఆయన ప్రశ్నించారు. ఒక్క టీటీడీ బోర్డులో మాత్రమే కాదని అనేక హిందూ సంస్థల్లో ఇతర మతస్తుల ప్రవేశానికి అవకాశం ఉండదన్నారు. కానీ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమ్స్ కానీ వారిని ఎందుకు పెట్టాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.